
మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. ఎప్పుడో ఒకసారి శరీరంలో ఏదో ఒక నొప్పి రావడం చాలా సర్వ సాధారణం. కొందరికి కాళ్ల నొప్పులు, మరికొందరికి ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఇలా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా నొప్పి రాగానే.. వెంటనే మనలో చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి మెగ్గుచూపుతూ ఉంటారు. ట్యాబ్లెట్ వేసుకుంటే మనకు వెంటనే నొప్పి తగ్గిపోతుంది.
శరీర నొప్పులలో తలనొప్పి ఒకటి. పని ఒత్తిడి వల్ల కొందరికి తలనొప్పి వస్తుంది. మరికొందరికి సైనస్ సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య, మైగ్రేన్ తదితర కారణాల వల్ల తలనొప్పి వస్తుంది.వాతావరణం మారినప్పుడు అంటే విపరీతమైన ఎండ, చలి కూడా తలనొప్పికి కారణమవుతాయి. చాలా మంది తలనొప్పి భరించలేక తలనొప్పి మాత్రలు మింగుతున్నారు.
తలనొప్పి తలకే పరిమితం కాదు. కంటి, చెవి, ముక్కు నరాలు అన్నీ మెదడు నాడులతో అనుసంధానించి ఉండడం వల్ల వాటిలో ఏదైనా భాగం దెబ్బతిన్నా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, తలనొప్పి వచ్చినప్పుడు, వెంటనే మాత్రలు మింగడానికి బదులుగా, ఆయుర్వేద ఔషధం లేదా ఇంటి నివారణలు వాడాలి. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు.
ఈ ఆయుర్వేద టీ తలనొప్పిని తగ్గిస్తుంది:
చాలా మంది తలనొప్పి వచ్చినప్పుడు వేడి వేడి టీ లేదా కాఫీ తాగుతుంటారు. టీ, కాఫీకి బదులుగా ఆయుర్వేద టీ తాగవచ్చు. ఆ టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
300 ml నీటిలో అర చెంచా వాము గ్రాము, ఒక చెంచా యాలకుల పొడి, ఒక చెంచా కొత్తిమీర గింజలు, 5 పుదీనా ఆకులను వేసి టీ ని మరిగించాలి. ఇది ఉదయం నిద్రలేవగానే తాగాలి. ఇది తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉపయోగించే వాము, యాలకులు, ధనియాల నుండి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
వాము: వాములో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, థయామిన్ , కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల మంట, అజీర్ణం, దగ్గు, జలుబు, మధుమేహం, ఆస్తమా, బరువు తగ్గడం వంటి సమస్యలు దూరమవుతాయి.
దనియాలు: దనియాల్లో ప్రోటీన్, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం,జింక్ వంటి పోషకాలు ఉంటాయి. జీవక్రియ, మైగ్రేన్ తలనొప్పి, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ వంటి సమస్యలకు ఇది దివ్యౌషధం.
పుదీనా: పుదీనాలో యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ట్యూమర్ , యాంటీ అలర్జీ లక్షణాలు ఉంటాయి. అంతే కాకుండా నిద్రలేమి, మైగ్రేన్, ఎసిడిటీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను పుదీనా నయం చేస్తుంది.
ఏలకులు : ఏలకులు సుగంధంగా ఉన్నందున మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. ఏలకులు అనారోగ్యం, వికారం, మైగ్రేన్, అధిక రక్తపోటు నుండి ఉపశమనం పొందుతాయి. ఏలకులు జుట్టు, చర్మానికి కూడా చాలా మంచిది.