ఇవి తింటే.. మీ రక్తం సహజంగానే ప్యూరిఫై అవుతుంది..!

By ramya SridharFirst Published Aug 26, 2024, 1:02 PM IST
Highlights

 రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలు కూడా కచ్చితంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే.. మన శరరీంలో రక్తం సహజంగా ప్యూరిఫై అవుతుందో ఓసారి తెలుసుకుందాం..


మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది.  అయితే.. మనం రోజూ చాలా రకాల ఫుడ్స్ తీసుకుంటూనే ఉంటాం. వాటిలో.. రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలు కూడా కచ్చితంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే.. మన శరరీంలో రక్తం సహజంగా ప్యూరిఫై అవుతుందో ఓసారి తెలుసుకుందాం..

ఈ ఫుడ్స్ తీసుకోవడంవల్ల.. మనం ఇతర మందులు లాంటివి ఏమీ వాడకపోయినా సహజంగా బ్లడ్ ఫ్యూరిఫై అవుతుంది. ఏదో ఒక రూపంలో  ఈ ఫుడ్స్ ని డైట్ లో భాగం చేసుకుంటే..శరీరంలోని టాక్సిన్స్ అన్నీ సులభంగా తొలగిపోతాయట. మరి, ఆ ఫుడ్స్ ఏంటో ఓ లుక్కేద్దాం..

Latest Videos

1.వాటర్..
మీకు నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. మంచినీళ్లు మనకు సహజంగా లభించే దేవుడు ఇచ్చిన వరం. నీరు మన బాడీలో రక్తాన్ని సహజంగా ప్యూరి ఫై చేయడంలో సహాబయపడుతుంది. టాక్సిన్స్ ని తొలగిస్తుంది. బాడీని చక్కగా క్లెన్స్ చేస్తుంది.

2.బీట్ రూట్స్..
రక్తాన్ని శుద్ధి చేయడంలో బీట్రూట్ ముందు ఉంటుంది. లివర్ ఫంక్షన్ సరిగా మెరుగుపరచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకంగా పని చేస్తుంది. టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది.

3.ద్రాక్ష..

ద్రాక్ష లో రిజ్వెరటాల్ అనే కాంపౌండ్ ఉంటుంది.  ముఖ్యంగా ఎరుపు, పర్పుల్ కలర్ ద్రాక్షలో  మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే.. వీటిని తినడం వల్ల.. మన శరీరంలో ని రక్తం దానంతట అదే శుద్ధి అవుతుంది.

4.పుచ్చకాయ...

పుచ్చకాయను మనం దాదాపు ఎండాకాలం ఇష్టంగా తింటూ ఉంటాం. ఎందుకంటే... ఈ కాలంలో మన బాడీ డీ హైడ్రేడెటెడ్ గా మారుతుంది. అదే.. పుచ్చకాయ తింటే... శరీరం హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇక్కడి వరకే మనకు తెలుసు. కానీ... వాటర్ మిలన్ తినడం వల్ల...  మన శరీరంలో రక్తాన్ని  శుద్ధి చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

5.కివి..
కివి పండులో విటమిన్ కె, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు... డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది.  ఇవన్నీ.. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో , రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి.

6.పసుపు..
పసుపులోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. మన లివర్ తో పాటు.. రక్తాన్ని శుద్ధి చేయడంలో  సహాయపడతాయి.

7.వెల్లుల్లి..
వెల్లుల్లి కూడా మన రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి.  దీనిలోనూ యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి.. ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.

click me!