బ్రెడ్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి.. తర్వాత తింటే ఏమౌతుంది..?

By ramya Sridhar  |  First Published Aug 26, 2024, 10:43 AM IST

బ్రెడ్ ని.. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం వల్ల అది చాలా డ్రైగా మారిపోతుంది. అలా గట్టిగా ఎండిపోయినట్లుగా అయినప్పుడు తినడానికి కూడా కష్టంగా ఉంటుంది.


బ్రెడ్ ని మన ఇండియన్స్  రెగ్యులర్ గా తమ డైట్ లో భాగం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా.. బ్రెడ్ చేసే టోస్టులు, శాండ్విచ్ లను పిల్లలు బాగా ఇష్టపడతారు.  కానీ.. బ్రెడ్ ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయలేం. వాటి కాలం  రెండు, మూడురోజులు మాత్రమే ఉంటుంది. దీంతో.. కొందరు బయట ఉంటే పాడౌతుందని.. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారు.  అలా ఫ్రిడ్జ్ లో ఉంచుకొని  ఆ తర్వాత తింటూ ఉంటారు. ఇలా తినొచ్చా..? తింటే ఏమౌతుంది..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

బ్రెడ్ ని.. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం వల్ల అది చాలా డ్రైగా మారిపోతుంది. అలా గట్టిగా ఎండిపోయినట్లుగా అయినప్పుడు తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇలా అయిన తర్వాత తినడం వల్ల  కడుపులో నొప్పి రావడం లేదంటు.. సరిగా  జీర్ణం అవ్వకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

Latest Videos

ఫ్రిడ్జ్  చల్లగా ఉండటం వల్ల.. అందులో పెట్టిన బ్రెడ్డు.. బయట ఉన్నదాని కంటే.. తొందరగా పాడైపోతుందట. దీనిని నమలడం కూడా చాలా కష్టంగా ఉంటుంది.  బ్రెడ్ టెక్చర్ కూడా.. మారిపోతుంది.

ఫ్రిడ్జ్ లో పెడితే.. బ్రెడ్ చాలా బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ..ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల.. దానిలో బ్యాక్టీరియా మరింత పెరుగుతుందట. అందుకే.. అలా తినడం వల్ల.. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

చాలా సింపుల్ గా మనం ఫ్రిడ్జ్ లో బ్రెడ్ ప్యాకేట్ పెడుతూ ఉంటాం. కానీ...  బ్యాక్టీరియా పెరిగిపోయి..దానిని తినడం వల్ల.. ఫుడ్ పాయిజనింగ్  అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానిలో ఉండే న్యూట్రియంట్స్ కూడా తగ్గిపోతాయి. నిజానికి ఫ్రిడ్జ్ లో విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. అవి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల పోవడమే కాకుండా... ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి. అరుగుదల సమస్యలు, జీర్ణ సమస్యలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి.. బ్రెడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి తినకపోవడమే మంచిది.


 

click me!