ఈ రోజుల్లో డయాబెటీస్ ఒక కామన్ వ్యాధి అయిపోయింది. ఇది మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా ఉపయోగించలేకపోవడం లేదా మొత్తమే లేకపోవడం వల్ల వస్తుంది. అయితే కొన్ని రకాల కూరగాయలు షుగర్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అవేంటంటే?
ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా డయాబెటీస్ బారిన పడుతున్నారు. కానీ ఈ డయాబెటీస్ తేలిగ్గా తీసిపారేసేంత చిన్న సమస్య అయితే కాదు. దీనివల్ల కళ్లపై, ఇతర శరీర భాగాలపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే దీన్ని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి.
డయాబెటీస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, జీవనళైలి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. డయాబెటీస్ ఒక జీవనశైలి వ్యాధి. ఈ వ్యాధి వల్ల మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోలేం. ఇది ఒక్క సారి వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. ఈ వ్యాధిని కేవలం కంట్రోల్ చేయగలం అంతే. అయితే కొన్ని రకాల కూరగాయలు షుగర్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అవేంటంటే?
undefined
డయాబెటిస్ లక్షణాలు
- విపరీతమైన దాహం
-తరచుగా మూత్రవిసర్జన
- ఆకలి పెరగడం
- బరువు తగ్గడం
డయాబెటీస్ పేషెంట్లు తినాల్సిన ఆహారాలు
క్యారెట్
షుగర్ పేషెంట్లకు క్యారెట్లు చాలా మంచివి. ఎందుకంటే క్యారెట్ లో ఉండే రకరకాల పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. క్యారెట్లలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లు మెండుతా ఉంటాయి. అలాగే ఈ కూరగాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది. క్యారెట్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. మొత్తంగా ఈ కూరగాయ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది.
బచ్చలికూర
బచ్చలికూర మధుమేహులకు చేసే మేలు అంతా ఇంతా కాదు. బచ్చలికూరలో ఫైబర్, విటమిన్ సి, ఫోలెట్ లు మెండుగా ఉంటాయి. ఇవన్నీ బ్లడ్ షుగర్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. ఈ ఆకు కూరలో కేలరీలు తక్కువగా, శరీరానికి అవసరమైన పోషణ ఎక్కువగా ఉంటుంది. బచ్చలికూరలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది.
టర్నిప్
అచ్చం బీట్ రూట్ లాగా ఉండే టర్నిప్ కూడా డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచిది. దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ఈ కూరగాయాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది.
బీట్ రూట్
బీట్ రూట్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా దీనిలో ఉండే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు డయాబెటీస్ పేషెంట్లకు అవసరమైన శక్తిని అందించడానికి సహాయపడతాయి. శక్తి పెరగడంలో ఒంట్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే దీనిలో ఉండే రకరకాల పోషకాలు మధుమేహుల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్ రూట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది. దీనిలో ఉండే మాంగనీస్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
కాకరకాయ
నిజం చెప్పాలంటే డయాబెటీస్ ఉన్నవారికి కాకరకాయ ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్, విటమిన్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. కాకరకాయ జ్యూస్ తాగినా, ఈ కూరను తిన్నా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.