నెయ్యి కలిపి చేసిన టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

By ramya SridharFirst Published Aug 28, 2024, 2:29 PM IST
Highlights

మలబద్దకం సమస్య కారణంగా  కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది.  ఇలాంటి సమస్యను తగ్గించడంలో.. ఈ గీ టీ మనకు బాగా సహాయపడుతుంది.

ఈ మధ్య చాలా మంది బుల్లెట్ కాఫీ అని తెగ తాగేస్తున్నారు. ఆ కాఫీ స్పెషల్ ఏంటి అంటే కాఫీలో నెయ్యి వేసుకొని తాగడమే. కానీ.. మీరు ఎప్పుడైనా .. నెయ్యి వేసిన టీ (గీ టీ) ఎప్పుడైనా తాగారా..? వినడానికి కాస్త కొత్తగా ఉన్నా.. ఈ టీ తాగడం వల్ల.. మన ఆరోగ్యం విషయంలో అద్భుతాలు జరుగుతాయట. మరి... ఈ గీ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...

ఈ మధ్యకాలంలో చాలా మంది గట్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం పూట వాష్ రూమ్ లో గంటలు గంటలు కష్టపడుతూ ఉంటారు. పొట్టలోకి బయటకు పంపించడానికి పడే కష్టం అంతా ఇంతా కాదు. దీనినే మలబద్దకం అంటారు. ప్రేగు కదలికలు సరిగాలేనప్పుడు.. ఈ మలబద్దకం సమస్య ఏర్పడుతుంది.ఒక్కోసారి దీని వల్ల  కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది.  ఇలాంటి సమస్యను తగ్గించడంలో.. ఈ గీ టీ మనకు బాగా సహాయపడుతుంది.

Latest Videos

మలబద్దకం రావడానికి కారణాలు ఏవైనా కావచ్చు. అంటే మధుమేహం, రక్తపోటు, పీసీఓడీ, సరైన స్లీప్ సర్కిల్ లేకపోవడం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో.. ఎక్కువగా ఈ మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. మంచి నీరు ఎక్కువగా తాగడం, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం , వ్యాయామం చేయడం లాంటివి అలవాటు చేసుకుంటే... అసలు ఈ మలబద్దకం సమస్యే ఉండదు. 


మలబద్ధకం సమస్యలలో అసౌకర్యం, అపానవాయువు, నొప్పి, తలనొప్పి , దుర్వాసన కూడా ఉండవచ్చు. కాబట్టి, ఆరోగ్య నిపుణులు వాత దోషాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం ,జీవనశైలిని నిర్వహించడం ఉత్తమ మార్గం 

మలబద్ధకం కోసం ఇంటి నివారణ: నెయ్యి టీ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో ఎలా సహాయపడుతుంది? 

నిపుణుల ప్రకారం.. నెయ్యితో కలిపిన బ్లాక్ టీ మన గట్ సమస్యలకు పులిస్టాప్ పెడుతుంది. నెయ్యి బ్యూట్రిక్ యాసిడ్  గొప్ప మూలంగా పరిగణిస్తారు.ఇది పేగు జీవక్రియను మెరుగుపరుస్తుంది, మలం కదలికలో సహాయపడుతుంది. ఇది కందెన , జీర్ణ లక్షణాలను కలిగి ఉంది, పేగు గోడలను మృదువుగా చేయడంలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు మద్దతు ఇస్తుంది.

బ్లాక్ టీ మలబద్ధకాన్ని నిరోధించడంలో ఎలా సహాయపడుతుంది? కొన్ని అధ్యయనాల ప్రకారం, బ్లాక్ టీ శరీరం  న్యూరోట్రాన్స్మిటర్ రేటును పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, దానిలోని కెఫిన్ కంటెంట్ ఒక ఉద్దీపనగా పనిచేస్తుంది, ఇది శారీరక విధులను వేగవంతం చేస్తుంది, ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది.


 

click me!