బ్లూ కలర్ బనానాలు ఎప్పుడైనా చూశారా. వాటిలో ఇన్ని పోషకాలా?

By Naga Surya Phani KumarFirst Published Sep 29, 2024, 11:18 PM IST
Highlights

మనకు తెలుసున్నంత వరకు అరటి పండు అంటే పసుపు, పచ్చ రంగుల్లోనే ఉంటుంది కదా? కాని నీలం రంగులో ఉండే అరటి పండు కూడా ఉందని మీకు తెలుసా? బ్లూ జావా బనానా (Blue Java Banana)అని పిలిచే ఈ పండు ఎక్కడ పండుతుంది? వీటిని ఉపయోగించి ఏఏ పదార్థాలు తయారు చేస్తారు? వీటిల్లో ఉండే పోషకాలు ఏమిటి? ఇంకా వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

అరటి సాగు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేపడతారు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడిని పొందాలంటే అరటి సాగు ఉత్తమం. ఈ పంటను ఎక్కువగా ఇండోనేషియా, చైనా, ఇండియా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం తదితర దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. మన దేశం అరటి పండ్ల సాగులో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉండటంతో భారతదేశంలో ఎక్కువగా సాగు చేస్తారు. ఇండియాలో దక్షిణ భారత దేశ రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ర్టలో అరటి సాగు ఎక్కువగా చేపడతారు. 

బ్లూ జావా బనానాను ఐస్ క్రీమ్ బనానా అంటారు

బ్లూ జావా బనానా(Blue Java Banana) చాలా అరుదైన అరటి పండు. ఈ పండ్లు  ప్రధానంగా ఆస్ట్రేలియా, హవాయి, తైవాన్, ఫిలిప్పీన్స్, పాపువా న్యూగినియా వంటి ప్రాంతాల్లో పండిస్తారు. ఇవి సాధారణ అరటి పండ్ల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. చాలా స్మూత్ గానూ ఉంటాయి. పండినప్పుడు వాటి ఆకుపచ్చ నుండి నీలంగా మారిపోతాయి. బ్లూ జావా బనానాను ఐస్ క్రీమ్ బనానా(Ice Cream Banana) అని కూడా పిలుస్తారు. ఇది ప్రత్యేకమైన రకం అరటి పండు. దీని బలమైన సిల్వర్ బ్లూ రంగును కలిగి ఉంటుంది. తింటే ఐస్ క్రీమ్ తిన్నట్లుగా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. 

బ్లూ జావా బనానా ఉపయోగాలు

Latest Videos

ఈ అరటి పండ్లను మామూలుగా తినేయొచ్చు. వాటిలో  తక్కువ స్వీట్ ఉంటుంది. అందుకే ఎవరైనా వీటిని ఇష్టపడతారు. చాలా మృదువుగా ఉంటాయి. వీటికి ఐస్ క్రీమ్ రుచి ఉండటం వల్ల ఇవి ప్రత్యేకంగా అనిపిస్తాయి.

ఈ బనానాలు ఐస్ క్రీమ్, మిల్క్ షేక్‌లు, స్మూతీలు, కేక్‌లు, పిండి పదార్థాలు, పన్నీర్ ఇతర డెసర్ట్స్‌లో కూడా ఉపయోగిస్తారు.

కొన్ని దేశాలలో బ్లూ జావా బనానాలతో పకోడీలు, చిప్స్ తయారు చేసి అమ్ముతారు. వంటల్లో వివిధ మిక్సింగ్లలో ఉపయోగిస్తారు. బ్లూ జావా బనానాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన పండ్లు ఇవి. వీటిని తినడం వల్ల మనిషికి అనేక లాభాలు ఉంటాయి. 

నీలం రంగు అరటి పండులో పోషకాలు

ఈ పండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది హార్ట్ ఫంక్షన్ మెరుగుపరిచేలా ఉపయోగపడుతుంది. వీటిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ B6 మెదడుకు సంబంధించిన ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుంది. శరీరంలో కార్బోహైడ్రేట్లు తయారు కావడానికి సహాయపడుతుంది. నీలం రంగు అరటి పండులో విటమిన్ C కూడా ఉంటుంది. ఇది  శరీరంలో ప్రతిస్పందన వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ A కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెగ్నీషియం నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో మాసిల్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి.


బ్లూ జావా బనానాతో ఆరోగ్య ప్రయోజనాలు

బ్లూ జావా బనానాలలో అధికంగా ఉన్న పొటాషియం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఈ పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఈ పండ్లలో ఉంటాయి. ఇవి శరీరంలో జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. మెగ్నీషియం శరీరంలోని ఎముకలను బలపరుస్తుంది. విటమిన్ B6 మనుషుల ఆరోగ్యానికి సంబంధించిన హార్మోన్ల సమతుల్యతకు కాపాడుతుంది. 

బ్లూ జావా బనానాల ప్రత్యేక లక్షణాలు

ఇవి సాధారణంగా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. అయితే పండినప్పుడు నీలి రంగులోకి మారతాయి. బ్లూ జావా బానానాలు ముదిరినప్పుడు ఆకుపచ్చ రంగు నుండి పసుపు లేదా నీలం రంగులో మారుతాయి. ఇది మామూలు అరటి పండు కన్నా తక్కువ తీపి ఉంటుంది. అయితే వీటితో ఐస్ క్రీమ్ వంటివి తయారు చేసి పిల్లలకు పెట్టొచ్చు. బ్లూ జావా బనానాలు చల్లగా, పొడిబారిన ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. ఇవి సాధారణ అరటి పండ్ల కంటే ఎక్కువ రోజులు వస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ పండ్లు ఎలాంటి రోగాలనైనా తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. 
 

click me!