ఈ కూరగాయలు బరువు తగ్గడానికి సహాయపడతాయి

By Shivaleela Rajamoni  |  First Published Aug 29, 2024, 4:38 PM IST

బరువు తగ్గడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మీకు తెలుసా? మీరు కొన్ని రకాల కూరగాయలను తిన్నా చాలా సులువుగా, ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అవేంటంటే?


ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. నిశ్చల జీవనశైలి వల్లే చాలా మంది బరువు విపరీతంంగా పెరిగిపోతున్నారు. అయితే బరువు తగ్గడంలో కూరగాయలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి కూరగాయలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కీరదోసకాయ

Latest Videos

undefined

కీరదోసకాయతో పాటుగా ఇతర ఆకు కూరలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు కీరదోసకాయను ఉదయం లేదా మధ్యాహ్న భోజనంలో ఉడికించి తినొచ్చు.అలాగే ఆకు కూరల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

పుట్టగొడుగులు

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, మీరు బరువు తగ్గడానికి, మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి పుట్టగొడుగులు ఎంతగానో సహాయపడతాయి. పుట్టగొడుగుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడతాయి.

బ్రోకలీ

బ్రోకలీలో ఫైబర్ కంటెంట్, ఆరోగ్యాకరమైన ఖనిజాలు,  విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో శరీరంలోని కొవ్వును తగ్గించడానికి సహాయపడే ఫైటోకెమికల్స్ కూడా మెండుగా ఉంటాయి. 

పచ్చిమిర్చి

పచ్చి మిర్చిని తిన్నా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు. పచ్చిమిర్చిలో  'కాప్సైసిన్' ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

గుమ్మడికాయ

అవును గుమ్మడికాయ కూడా మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కవుగా ఉంటుంది. దీన్ని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. గుమ్మడికాయను సలాడ్లు లేదా స్మూతీలలో కూడా చేర్చుకోవచ్చు.

క్యారెట్

బరువు తగ్గించే ఆహారంలో మీరు చేర్చగల బెస్ట్ ఫుడ్ లో క్యారెట్ ఒకటి. క్యారెట్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ కూరగాయలో కరిగే, కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.. క్యారెట్‌ను జ్యూస్‌గా లేదా ఎన్నో విధాలుగా తినొచ్చు.

క్యాబేజీ

క్యాబేజీ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక కప్పు ఉడికించిన క్యాబేజీలో 34 కేలరీలు ఉంటాయి.దీనిలో కొవ్వు ఉండదు. క్యాబేజీలో ఉండే ఫైబర్ కేలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది. 

click me!