రామ్ చరణ్ పై 'జీ స్టూడియో' భారీ పెట్టుబడి

By Surya Prakash  |  First Published Nov 21, 2021, 11:29 AM IST

ఈ మెగా ప్రాజెక్టుకు జీ స్టూడియో వారు ఫండింగ్ ఇవ్వనున్నారు. దిల్ రాజు తో కలిపి లాభాల్లో షేర్ తీసుకోబోతున్నారు. మరిన్ని భారీ సినిమాలు ప్లాన్ చేసిన దిల్ రాజు ఇలా జీ స్టూడియో సాయింతో ఈజీగా ఈ ప్రాజెక్టుని ఏ విధమైన ఫైనాన్సియల్ ఇబ్బంది లేకుండా పూర్తి చేయగలుగుతారు. 


రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్‌ ఇటీవలే పూర్త‌య్యింది. పూనే, స‌తారా, పాల్‌ట‌న్ ప్రాంతాల్లో స్పెష‌ల్ సీక్వెన్స్‌ల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించారు. రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో  ప్రారంభమైంది . శంకర్ అన‌గానే సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగినట్లు భారీ పెట్టుబడితో సినిమా చేస్తన్నారు. అందుకు ఫైనాన్సియల్ సపోర్ట్ గా జీ స్టూడియో జాయిన్ అయ్యింది.

సౌత్ మార్కెట్లో వరస ప్రాజెక్టులతో దూసుకుపోవటానికి జీ స్టూడియో ప్లాన్ చేసుకుంది. అందుకు తగినట్లే ప్రాజెక్టులు సెట్ చేసుకుంటోంది. ఇప్పుడు దిల్ రాజుతో ఈ ప్రాజెక్టు విషమయై ఎగ్రిమెంట్ కుదుర్చుకుందని సమాచారం. ఈ మెగా ప్రాజెక్టుకు జీ స్టూడియో వారు ఫండింగ్ ఇవ్వనున్నారు. దిల్ రాజు తో కలిపి లాభాల్లో షేర్ తీసుకోబోతున్నారు. మరిన్ని భారీ సినిమాలు ప్లాన్ చేసిన దిల్ రాజు ఇలా జీ స్టూడియో సాయింతో ఈజీగా ఈ ప్రాజెక్టుని ఏ విధమైన ఫైనాన్సియల్ ఇబ్బంది లేకుండా పూర్తి చేయగలుగుతారు. 2023లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. వాటికి ధీటుగా స్టైలిష్‌గా రామ్ చరణ్ మూవీ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇప్పటికే గ్రాండ్‌గా చిత్రీక‌రించిన‌ సన్నివేశాలు సినిమాలో వ‌న్ ఆఫ్ ది హైలైట్ అంశాలుగా నిలుస్తాయని తెలుస్తుంది. 

Latest Videos

Also read Nayanatara: హీరోలకు సమానంగా... చిరు సినిమా కోసం కోట్లు తీసుకుంటున్న నయనతార!

సినిమా కాస్ట్ అండ్ క్రూను డైరెక్ట‌ర్ శంక‌ర్ ముందుకు న‌డిపిన విధానం, ఔట్‌పుట్‌పై మేక‌ర్స్ హ్య‌పీగా ఉన్నారు. ఇక మూవీలో స‌రికొత్త పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌ను శంక‌ర్ స‌రికొత్త రీతిలో ప్రెజంట్ చేయ‌బోతున్నారు. ఇటు ప్రేక్ష‌కుల‌ను, అటు మెగాభిమానుల అంచనాల‌ను మించి సినిమా ఉంటుంది. కొర‌టాల శివ‌ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఆచార్య‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తోక‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాల్లో న‌టించిన త‌ర్వాత‌ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్ర‌మిది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా నటిస్తోన్న 15వ సినిమా ఇది. అలాగే శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న 50వ మూవీ కూడా ఇదే కావడం విశేషం. త‌న బ్యాన‌ర్‌లో మ‌రే సినిమాకు పెట్ట‌నంత భారీ బ‌డ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌తో ఇండియ‌న్ సినిమాల్లోనే ల్యాండ్ మార్క్ మూవీలా నిలిచిపోయేలా దిల్‌రాజు, శిరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  కియారా అద్వానీ, జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ సంగీతం సార‌థ్యం వహిస్తున్నారు.

Also read Mahesh babu: కథా లేదు, జోనర్ తెలియదు.. విలన్ పేరు సోమలింగం

click me!