Bigg boss telugu 5: బిగ్ బాస్ లీక్... ఈ వారం హౌస్ నుండి ఆ కంటెస్టెంట్ అవుట్

Published : Nov 21, 2021, 08:50 AM ISTUpdated : Nov 21, 2021, 08:52 AM IST
Bigg boss telugu 5: బిగ్ బాస్ లీక్... ఈ వారం హౌస్ నుండి ఆ కంటెస్టెంట్ అవుట్

సారాంశం

బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేటయ్యే కంటెస్టెంట్ నేమ్ ముందుగానే లీక్ అవుతుంది. ప్రతివారం ప్రచారం జరుగుతున్న కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నారు. కాగా నేడు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు కూడా బయటికి వచ్చింది. 

ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ (Bigg boss telugu 5) నుండి తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. గత వారం జెస్సీ ఎలిమినేట్ కాకుండానే, అనారోగ్య కారణాలతో హౌస్ ని వీడారు. పది మంది వెళ్ళిపోయాక ప్రస్తుతం హౌస్ లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎలిమినేషన్ కొరకు 8మంది నామినేట్ అయ్యారు. కెప్టెన్ కావడం వలన యాంకర్ రవి నామినేషన్ నుండి తప్పించుకున్నారు. 


ఇక ఎలిమినేషన్ లో ఉన్న ఎనిమిది మంది సభ్యుల నుండి నిన్న శ్రీరామ్, మానస్ లను సేవ్ చేశాడు నాగార్జున. ఇంకా మిగిలింది మానస్, ప్రియాంక, కాజల్, సిరి, షణ్ముఖ్, యాని మాస్టర్. కాగా ఈ ఆరుగురు సభ్యుల నుండి నేడు యాని మాస్టర్ హౌస్ ని వీడనున్నారని సమాచారం. నామినేషన్స్ లో ఉన్నవారిలో అతి తక్కువ ఓట్లు పొందిన యాని మాస్టర్ ఎలిమినేట్ అయ్యారట. 


కాజల్ పై నిప్పులు చెరుగుతూ.. ఆమెను ఎప్పుడూ ఎగతాళి చేస్తూ యాని మాస్టర్ నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. యాని మాస్టర్ ని బయటికి పంపేయాలి, ఆమె యాటిట్యూడ్ చాలా వరస్ట్ గా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. నిన్న నాగార్జున సైతం యాని మాస్టర్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి, మందలించారు. అలా వెక్కిరించడం తప్పని తెలియజేశాడు. మొత్తంగా యాని మాస్టర్ హౌస్ ని వీడారట. ఈ బిగ్ బాస్ లీక్ పై మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. 

Also read Big Boss Telugu 5: హౌజ్‌ నుంచి వెళ్లిపొమ్మంటూ షణ్ముఖ్‌, సిరిలకు ఊహించని షాకిచ్చిన నాగ్‌ .. సన్నీనే విన్నర్‌
కాగా హౌస్ లో ఉన్న జంటలను కూడా నాగార్జున (Nagarjuna) హెచ్చరించడం జరిగింది. రిలేషన్ ఇరుక్కుపోయి గేమ్ ఆడకుండా ఫెయిల్ అవుతున్న షణ్ముఖ్, సిరిలకు పెర్సనల్ గా కన్ఫెషన్ రూమ్ లో హితబోధ చేశాడు. అలాగే ప్రియాంక అతిగా నీపై ఆశలు పెట్టుకుంటుందని, మానస్ కి చెప్పి, నిజం చెప్పి కట్ చేసుకో అని సలహా ఇచ్చాడు. ఇక షో చివరి దశకు చేరుకుంది. దీనితో టాస్కులు, గేమ్స్ మరింత కఠినంగా మారాయి. ఫైనల్ కి వెళ్లే ఆ ఐదుగురు కంటెస్టెంట్స్ ఎవరు? వారిలో టైటిల్ దక్కేది ఎవరికి? అనే ఉత్కంఠ మొదలైపోయింది. కొందరు సెలెబ్రిటీలు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తూ, వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. 

Also read Bigg Boss Telugu 5: దీప్తి గుర్తుల్లో షణ్ముఖ్‌.. సిరి కన్నీళ్లు.. రవి నారదుడు.. బిగ్‌బాస్‌కి సన్నీ మొర

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?