Ennenno Janmala Bandham: అభి నిజస్వరూపం తెలుసుకున్న యష్.. చిత్ర, వసంత్ మధ్య రొమాంటిక్ సీన్?

Published : Feb 10, 2023, 12:39 PM IST
Ennenno Janmala Bandham: అభి నిజస్వరూపం తెలుసుకున్న యష్.. చిత్ర, వసంత్ మధ్య రొమాంటిక్ సీన్?

సారాంశం

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 10వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్లో చిత్ర ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వేద అక్కడికి వచ్చి చిత్ర ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో నా మూడేం బాగోలేదు అక్క అంటుంది. అప్పుడు వేద ఇలా రా చిత్ర వచ్చి కూర్చో అసలు ఏం జరిగింది అనడంతో చిత్ర జరిగింది మొత్తం వివరించగా వేద షాక్ అవుతుంది. నేను కూడా ఇందాకే వాడి నిజ స్వరూపం తెలుసుకున్నాను చిత్ర ఆ నీచుడు మాళవికను పెళ్లి చేసుకోకుండా మోసం చేయాలని చూస్తున్నాడు అనడంతో చిత్ర షాక్ అవుతుంది. ఇక తప్ప తాగి నోటికి వచ్చిన విధంగా మాట్లాడాడు ఆ మాళవికను పెళ్లి చేసుకోను వదిలేస్తాను అన్నాడు అంటుంది వేద. మాళవిక ఎలాంటిదైనా ఆ అభిమన్యు పెళ్లి చేసుకుంటాడు అన్న ఆశతో వాడితోనే జీవిస్తుంది కానీ వీడు చూస్తే ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అంటుంది వేద.

ఈ సంగతి తెలిస్తే తాను తట్టుకుంటుందా అని అంటుంది. వాడు వదిలేస్తే మాళవిక పరిస్థితి ఏంటి అని బాధపడుతూ ఉండగా ఆ మాళవిక ఏమైనా తక్కువ చేసిందా అక్క అని అంటుంది చిత్ర. ఆ మాళవిక కూడా ఫ్యామిలీని వద్దనుకొని వాడికోసం వెళ్ళింది ఇప్పుడు తన జరగబోతోంది అనుకుంటూ ఉంటుంది వేద. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని మన మధ్య ఉంచుదాం ఎవరికి చెప్పొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. తర్వాత వేద ఫ్రెష్ అయ్యి ఈయన ఏంటి నాకంటే ముందే బయలు దేరాడు ఇంకా రాలేదు అనుకుంటూ ఉండగా ఇంతలోనే యష్ అక్కడికి వస్తాడు.

ఆంటీ ఏంటి నేను నీకోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయాను అనుకుంటున్నావా అంటూ యష్ చెప్పకనే తనను నిజం చెప్పేస్తాడు. ఇప్పటివరకు నాకు డౌట్ ఉంది కానీ ఇప్పుడు మీరే కన్ఫామ్ చేశారు అని అంటుంది వేద. కానీ యష్ మాత్రం బయటపడకుండా దానికి అప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు వారిద్దరూ సరదాగా ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత చిత్ర ఆఫీస్ కి వెళ్తుండగా వసంత్ అడ్డుపడగా ఏమైంది వసంత ఏమైనా ప్రాబ్లమా అనడంతో నా ప్రాబ్లం నువ్వే చిత్ర అని అంటాడు. జాబు రాగానే నన్ను మర్చిపోయావా అని అనడంతో ఓవర్ చేయకు నాకు కొత్త జాబ్ కదా అది అయిపోగానే మీట్ అవుదాం అని అంటుంది.

నువ్వే కాదు వసంత్ ఎప్పుడెప్పుడు సండే వస్తుందా నీతో కలిసి స్పెండ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నాను అంటుంది చిత్ర. అప్పుడు వసంత్ చిత్రని ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత నీళ్లు పోస్తూ ఉండగా ఇంతలో అక్కడికి యష్ వస్తాడు. ఏదో చెప్పాలి అనుకుంటున్నావు చెప్పు అనడంతో రాత్రి పార్టీ గురించి అనడంతో అయిపోయింది కదా మళ్ళీ దాని గురించి ఎందుకు అంటాడు. నేను విన్ని గురించి కాదు అభిమన్యు గురించి మాట్లాడాలి అని అంటుంది. ఆ నీచుడు తాగిన మైకంలో ఏం మాట్లాడాలో తెలుసా అని వేద జరిగింది మొత్తం వివరించడంతో యష్ షాక్ అవుతాడు. మనం తెలిసి తెలిసి మాళవికకు ఆ అభిమన్యు అన్యాయం చేస్తే చూస్తూ ఉంటాము ఏదో ఒకటి చేసి వాడి ప్లాన్ ని చెడగొట్టాలి అనుకుంటూ ఉంటుంది వేద.

తర్వాత యష్, మాళవిక ఇద్దరూ హోటల్లో కలుస్తారు. ఎందుకు రమ్మన్నావో చెప్పు అని అంటుంది మాళవిక. అప్పుడు యష్ జరిగింది మొత్తం వివరించడంతో మాళవిక షాక్ అవుతుంది. తర్వాత వేద విన్నీ ఒకచోట కలుసుకుంటారు. అప్పుడు విన్నీ నేను నిన్ను ఒక విషయం అడుగుదామని ఇక్కడికి పిలిచాను నువ్వు పర్ఫెక్ట్ గానే ఉన్నావా అని అడుగుతాడు. మరోవైపు మాళవిక యష్ మాటలను తప్పుగా అపార్థం చేసుకుంటుంది. మరోవైపు విన్నీ ఖుషి అంటే మీ హస్బెండ్ డాటర్ కదా అనగా కాదు నా డాటర్. నా ప్రపంచం ఇంట్లో అందరికంటే నాతోనే ఎక్కువ బాండింగ్ ఉంది అని అంటుంది వేద.

నీ భర్త యశోదర్ కి నీకు లైఫ్ లో మళ్ళీ సెకండ్ ఛాన్స్ దొరికింది వదులుకోకు వేద అని అంటాడు విన్నీ. అప్పుడు విన్నీ నువ్వు మీ హస్బెండ్ లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు వేద ఏం మాట్లాడాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు ఐ డోంట్ బిలీవ్ దిస్ నేను ఇది నమ్మను అని అనడంతో నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం అని అంటాడు. నన్ను నా అభిమానిని విడదీయడానికి ప్లాన్ చేస్తున్నారా అంటూ యష్ నీ తప్పుగా అపార్థం చేసుకుని మాట్లాడుతుంది. ఇప్పుడు విన్నీ అడిగిన దానికి వేద స్ట్రైట్ గా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్