అమెరికాలో ఆర్పీ చేపల పులుసు..? ఫారెనర్స్ కు టేస్ట్ చూపిస్తానంటున్న కమెడియన్

Published : Feb 10, 2023, 12:35 PM IST
అమెరికాలో ఆర్పీ చేపల పులుసు..? ఫారెనర్స్ కు టేస్ట్ చూపిస్తానంటున్న కమెడియన్

సారాంశం

ఆర్పీ చేపల పులుసు ఘాటు త్వరలో ఆమెరికాను చేరబోతోంది. హైదరాబాద్ లో సెకండ్ బ్రాంచ్ ను ఓపెన్ చేసిన ఆర్పీ.. తన  నెల్లూరు చేపల పులుసు  బ్రాంచ్ ను అమెరికాలో ఓపెన్ చేస్తానంటున్నాడు. 

ఆర్పీ చేపల పులుసు ఘాటు త్వరలో ఆమెరికాను చేరబోతోంది. హైదరాబాద్ లో సెకండ్ బ్రాంచ్ ను ఓపెన్ చేసిన ఆర్పీ.. తన  నెల్లూరు చేపల పులుసు  బ్రాంచ్ ను అమెరికాలో ఓపెన్ చేస్తానంటున్నాడు. 

జబర్థస్త్ స్టార్ కమెడియన్ గా లైఫ్ స్టార్ట్ చేసి.. బిజినెస్ మెన్ గా ఎదిగాడు జబర్థస్త్ ఆర్పీ..అలియాస్ రామ్ ప్రసాద్. సాధారణ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ గా ఎదిగిన ఆర్పీ.. చాలా కాలం క్రితమే జబర్థస్త్ ను వీడి బయటకు వచ్చాడు. వచ్చీ రావడంతోనే జబర్థస్త్ పై రకరకాల ఆరోపణలు చేసి సంచలనంగా మారాడు. జబర్థస్త్ నుంచి బయటకు వచ్చిన తరువాత పలు సినిమాలకు పనిచేసిన ఆర్పీ.. డైరెక్టర్ గా మారి సినిమా కూడా తెరకెక్కించాడు. ఇక ఏదీ వర్కైట్ అవ్వకపోవడంతో.. బిజినెస్ వైపు మళ్ళాడు. 

ఈక్రమంలో తనకు జబర్థస్త్ లో  బాగా అచ్చొచ్చిన నెల్లురు యాస.. నెల్లూరు చేపల పులుసును లీడ్ తీసుకుని..నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ ను ఏర్పాటు చేశాడు. చాలా తక్కువ టైమ్ లోనే ఈ చేపల పులుసుకి బాగా డిమాండ్ వచ్చింది. జనాలను కంట్రోల్ చేయలేనంతగా పాపులారిటీ సాదించాడు ఆర్పీ. ఎంత పాపులారిటీ వచ్చిందో.. అంతే నెగెటీవ్ టాక్ కూడా వచ్చింది. ఏదో ప్రచారం తప్పించి ఆ చేపల పులుసులో అంత మ్యాటర్ లేదు అంటూ.. సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే ఎవరో కావాలని తన బిజినెస్ ను దెబ్బ తీయాలని చూస్తున్నారన్నారు ఆర్పీ. 

ఇక రీసెంట్ గా మణికొండలో కూడా నెల్లూరు చేపల పులుసు  బ్రాంచ్ ను ఏర్పాటు చేశాడు ఆర్పీ. ఆబ్రాంచ్ ను చాలా గ్రాండ్ గా ఓపెన్ చేశాడు. ఈసందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్పీ.. నెల్లూరు చేపల పులుసు బ్రాంచ్ ను అమెరికాలో కూడా ఓపెన్ చేస్తానన్నారు. అక్కడి వారికి మన చేపల పులుసు రుచిచూపిస్తానంటున్నాడు ఆర్పీ. 

ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ..నా బిజినెస్ కు సక్సెస్ కావడానికి చాలా మంది సహకరించారు వారందరికి నాకృతజ్ఞతలు అన్నారు.  జబర్థస్త్ లో తనతో పాటు ఎదిగిన సీనియర్ కమెడియన్  అదిరే అభి అమెరికాలో కూడా చేపల పులుసు పెట్టాలని కోరుకున్నారని.. పక్కాగా అమెరికాలో ఆర్పీ చేపల పులుసు పెడతాను. కొద్దిగా అనుభవం, మ్యాన్ పవర్ పెరిగాక అక్కడి తెలుగు వారికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రుచి చూపిస్తాను అన్నారు ఆర్పీ. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు