
ఈరోజు ఎపిసోడ్లో రామచంద్ర ఇంటికి వచ్చి జ్ఞానాంబని చూసి అమ్మ జరిగిన దానికి ఇంకా బాధపడుతూనే ఉంది అనుకుంటూ లోపలికి వెళ్తాడు. మలయాళం అమ్మ భోజనం చేసిందా అని అడగగా లేదు అసలు వంట చేయమని కూడా ఎవరూ చెప్పలేదు అందరు బాధపడుతున్నారు అని అంటాడు. తర్వాత జానకి దగ్గరికి వెళ్తాడు రామచంద్ర. అప్పుడు జానకి బాధపడుతూ ఉండగా ఏంటి జానకి గారు బాధపడుతున్నారా అనగా ఇంకేం చేయాలి రామా గారు ఒక్కరోజులో ఇంటి పరిస్థితులు మొత్తం మారిపోయాయి అంటుంది జానకి. మల్లిక చేసిన పనికి ఇంట్లో అందరూ బాధ పడుతున్నారు అనగా మల్లిక గురించి మనకు తెలిసిందే కదా రామా గారు.
నేరస్తుల్ని పట్టుకునే డిపార్ట్మెంట్లో పని చేయాలి అనుకుంటున్న నన్ను నేరస్తురాలిని చేసింది అని అంటుంది జానకి. నేను అత్తయ్య గారిని అన్నదానికే బాధపడుతున్నాను అనగా అప్పుడు రామచంద్ర ఎవరితో మాట్లాడుతుందో ఎవరిని బాధ పెడుతుందో తనకి అర్థం కావడం లేదు జానకి గారు అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నేను విష్ణుతో మాట్లాడతాను అని రామచంద్ర అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరోవైపు విష్ణు ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి మల్లిక కోడలు కాబట్టి మేము ఏమి చెప్పలేకపోవచ్చు. కట్టుకున్న భార్యకి నువ్వు కూడా సర్ది చెప్పలేవా అని అంటుంది. గొడవ జరగగానే వెంటనే ఇల్లు చూసి అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది అని అంటాడు విష్ణు.
అది చెబితే అడ్వాన్స్ వెనక్కి తీసుకుంటుంది కదా అనగానే నేను చెప్పలేను నాన్న అనడంతో భర్త స్థానంలో ఉండి అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా అనగా పంతాన్ని మాత్రం వదలదు, నన్నైనా వదిలేస్తుంది అంటాడు విష్ణు. తన మాటలు విని అమ్మ నాన్న వదిలేసి వెళ్తావా అని రామచంద్ర అనడంతో లేదంటే తను నన్ను వదిలేసి వెళ్తానని అంది అన్నయ్య మరి ఏం చేయాలో చెప్పు అని అంటాడు. మీరు ఎన్ని చెప్పిన కానీ తను ఒప్పుకోదమ్మా అని అంటాడు విష్ణు. నాకు రెండు మార్గాలు ఒకటి తనతో వెళ్లడం లేదంటే కాపురాన్ని విడగొట్టుకొని ఒంటరిగా బతకడం అని అంటాడు. అప్పుడు జానకి నువ్వు చాలా ఎక్కువగా భయపడుతున్నావ్ విష్ణు ఒకసారి తనకి నచ్చ చెప్పి చూడు అని అంటుంది జానకి.
నా భార్య వింటుందో వినదో నాకు తెలియదా వదిన అయినా ఇక్కడ ఉండడం కంటే వెళ్లిపోవడమే మంచిది ప్రశాంతత దొరుకుతుంది అని అంటాడు విష్ణు. అప్పుడు వెంటనే జ్ఞానాంబ నీకు ఇక్కడ ప్రశాంతత లేదా అనగా ఎక్కడ ఉంది అమ్మ అని అంటాడు. మల్లిక ఏదైనా అంటే మీకు నచ్చదు ఇలా రోజు గొడవ పడే దానికంటే వెళ్లిపోవడమే మంచిది అని అంటాడు. అందుకే నేను వెళ్ళాను నిర్ణయించుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విష్ణు. అప్పుడు గోవిందరాజులు మల్లిక కంటే ముందు విష్ణునే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు మనం ఎంత చెప్పినా వినడు వదిలేయ్ అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ అసలు ఇదంతా రామ వల్లే రామ అప్పు చేయకపోయి ఉంటే ఇలా జరిగేదా అని అంటుంది.
అందరూ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంటే చూడ్డం తప్ప నేను ఏమీ చేయలేను అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు గోవిందరాజులు జ్ఞానాంబకు ధైర్యం చెబుతూ ఉంటాడు. చూసారా జానకి గారు ఇంట్లోంచి అందరూ వెళ్లిపోవడానికి నేనే కారణం మాట్లాడుతుంది అని అంటాడు రామచంద్ర. అత్తయ్య వాళ్ళు చెప్తేనే వినలేదు మనం చెప్తే వింటారా రామ గారు అయినా వాళ్ళు వెళ్లిపోవాలి అనుకున్నారు కనుక వెళ్ళిపోతున్నారు అంటుంది జానకి. అప్పుడు వారిద్దరు బాధపడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత జ్ఞానాంబ ఒకచోట కూర్చొని జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి జెస్సీ కాఫీ తీసుకుని వస్తుంది. అప్పుడు ఏమ్మ ఉండేది ఒక్కరోజే ఆలోపు అత్తయ్య గారికి సేవలు చేద్దామని అనుకుంటున్నావా అనడంతో అలాంటిదేమీ లేదు అత్తయ్య అని అంటుంది.
నేను నీకు ఏమైనా లోటు చేశానా మరి అలాంటిది నువ్వు ఎందుకు అఖిల్ తో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పావు అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు అఖిల్ మాటలు నిజమని నమ్మిన జ్ఞానాంబ జెస్సిని అపార్థం చేసుకుంటుంది. జెస్సిని మరింత అపార్థం చేసుకుంటూ మాట్లాడడంతో జెస్సి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జెస్సి లోపలికి వెళ్లి జ్ఞానాంబ అన్నమాటలు తలచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండగా ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. చూసావా అక్క అత్తయ్య గారు నన్ను ఎంతలా అపార్థం చేసుకుంటున్నారో నేను అసలు అఖిల్ కి చెప్పలేదు అక్క అని బాధపడుతూ ఉంటుంది జెస్సి. అఖిల్ అవకాశం దొరికింది కదా అని వెళ్ళిపోవాలని చూస్తున్నాడు కానీ అత్తయ్య దృష్టిలో నేను నేరస్థురాలిని అడిగాను అని బాధపడుతూ మాట్లాడుతుంది జెస్సి. జెస్సి బాధపడుతూ మాట్లాడుతుండగా జానకి ఓదారుస్తుంది.