Ennenno Janmala Bandham: విన్నిలో బయటపడ్డ మరో కోణం.. డివోర్స్ కి సిద్ధమైన యష్ దంపతులు!

Published : Mar 14, 2023, 01:06 PM IST
Ennenno Janmala Bandham: విన్నిలో బయటపడ్డ మరో కోణం.. డివోర్స్ కి సిద్ధమైన యష్ దంపతులు!

సారాంశం

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారం పోతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అందరి హృదయాలను దోచుకుంటూ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ముక్కోపి భర్తతో భార్య పడే ఇబ్బందులను చక్కగా చూపిస్తుంది ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

యష్ ని తప్పు చేశావు అంటూ మందలిస్తాడు వసంత్. నువ్వు కూడా నన్నే అంటున్నావా అంటాడు యష్. వదిన అంతా ప్రేమగా గిఫ్ట్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా రిజెక్ట్ చేయడం తప్పే కదా నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూస్తావు అదే నీతో ప్రాబ్లం అంటాడు వసంత్. జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు అంటాడు యష్.

ఇందులో ఆలోచించడానికి ఏముంది వదినకి ఫోన్ చేసి సారీ చెప్పు అంటాడు వసంత్. యాక్సెప్ట్ చేస్తుందంటావా అంటాడు యష్. నువ్వు ఫోన్ చేస్తేనే కదా తెలుస్తుంది అంటూ యష్ చేత బలవంతంగా ఫోన్ చేయిస్తాడు వసంత్. అదే సమయంలో వేద కూడా తనని అర్థం చేసుకోనందుకు బాధపడుతుంది. తర్వాత అయినా కూల్ అయ్యి నాకు కాల్ చేసి సారీ చెప్పొచ్చు కదా అనుకుంటుంది.

అంతలోనే యష్ ఫోన్ చేస్తాడు. అలా అనుకోగానే ఇలా ఫోన్ చేశారు, సారీ చెప్తారేమో. అవునా ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయాలా సారీ చెప్తే యాక్సెప్ట్ చేయాలా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయదు వేద. యష్ మళ్లీ మళ్లీ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయదు. చూడు తను లిఫ్ట్ చేయటం లేదు కావాలనే లిఫ్ట్ చేయడం లేదు అంటాడు యష్. తప్పు చేసింది నువ్వు వదినని అంటావేమి అయినా తను క్లినిక్ లో బిజీగా ఉందేమో అంటాడు వసంత్.

తనని వెనకేసుకొస్తే ఊరుకోను, కావాలంటే నీ ఫోన్ తో ట్రై చెయ్యు అంటాడు యష్. సరే అంటూ తన ఫోన్ తో ఫోన్ చేస్తాడు వసంత్. తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు వేద. చూసావా లిఫ్ట్ చేయట్లేదు తనకి ఆటిట్యూడ్ ఎక్కువ నేను కాబట్టి తనని భరిస్తున్నాను అంటాడు యష్. ఇంక నీ సోది ఆపు ఇప్పుడు నీకేం కావాలి వదిన నీ సారీ ని యాక్సెప్ట్ చేయాలి అంతే కదా అంటూ వేద కి ఫోన్ చేసి యష్ కి యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు.

ఒక్కసారిగా షాక్ అవుతుంది వేద. గాంధీ పార్క్ దగ్గర యాక్సిడెంట్ అయింది అంట నేను బయలుదేరుతున్నాను నువ్వు కూడా బయలుదేరు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వసంత్. యష్ కూడా కంగారుగా ఈ యాక్సిడెంట్ గోల ఏంట్రా అని అడుగుతాడు. ఈ మాత్రం టెన్షన్ పెట్టకపోతే వదినని సారీ ని యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు నువ్వు వెళ్లి అర్జెంటుగా గాంధీ పార్క్ దగ్గర వెయిట్ చెయ్యు.

వదినతో జాగ్రత్తగా డీల్ చెయ్యు అని యష్ ని పంపిస్తాడు వసంత్. వేదం కంగారుగా ఆయన అందుకే ఫోన్ చేసి ఉంటారు నేను లిఫ్ట్ చేయవలసింది అనుకుంటూ కంగారుగా వెళుతుంది. అక్కడ ఎవరు కనబడకపోవడంతో అటు ఇటు వెతుకుతుంది. అక్కడ ఒక వ్యక్తిని ఇక్కడ యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా అని అడుగుతుంది. ఇక్కడ ఏమి జరగలేదు అని చెప్పాడు అతను.

వసంత్ ఇక్కడే అని చెప్పాడు, కానీ ఇక్కడ ఏమీ లేదు అయినా వసంత కూడా వస్తానన్నాడు ఇంకా రాలేదేంటి అంటూ వసంత్ కి ఫోన్ చేస్తుంది వేద. వదిన నాకు ఫోన్ చేస్తుందేంటి అంటే ఇంకా యష్ వెళ్లలేదా అనుకుంటూ వేద ఫోన్ లిఫ్ట్ చేయకుండా యష్ కి ఫోన్ చేసి వదిన నాకు ఫోన్ చేస్తుంది నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్తాడు వసంత్. దగ్గర్లోనే ఉన్నాను వెళ్తున్నాను అంటాడు యష్.

మరోవైపు వేద అక్కడ ఉన్న వాళ్ళందరినీ యాక్సిడెంట్ అయిందని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక గ్యాంగ్ వేదని చూసి ఈ అమ్మాయే కదా అని అనుకుంటారు. వేద వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇక్కడ యాక్సిడెంట్ ఏమైనా అయిందా అని అడుగుతుంది. చూసాము, వాళ్ళు మీకు తెలిసిన వాళ్లా రండి మేం తీసుకెళ్తాము అంటారు. ఆమెని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లి పోతుంటారు.

అప్పుడే అక్కడికి వచ్చిన యష్ ని చూసి పిలుస్తుంది  వేద. కానీ యష్ కి వినబడదు. వేద కార్ నుంచి దూకేసి వచ్చి యష్ కి ఎదురుగా నిలుచుంటుంది. ఆ రౌడీలు వచ్చి ఆమెని ఎత్తుకెళ్ల బోతుంటే యష్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. వాళ్లు పారిపోవడంతో మీకు ఏమీ జరగలేదు కదా వసంత్ ఫోన్ చేసి మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పగానే చాలా భయం వేసింది. అయినా మీరు చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేస్తారు కదా యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతుంది వేద.

యాక్సిడెంట్ ఏమి జరగలేదు అంటాడు యష్. మరి వసంత్ అలా చెప్పాడేంటి అంటుంది వేద. వాడు అబద్ధం చెప్పాడు, నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నిన్ను ఇక్కడికి రప్పించడానికి అంటూ ఉండగానే అతని చెంప చెళ్ళు మనిపిస్తుంది వేద. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, ఎంత భయం వేసిందో ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెప్తారా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది వేద.

 మాట్లాడడానికి నీతో మాట్లాడటం కోసం వసంత నాకు చెప్పకుండా అంటూ ఉండగానే ఇంకా ఆపండి మీరు తప్పు చేసి నిండా వేరే వాళ్ళ మీద వేసేస్తున్నారు ఇద్దరు మనుషుల మధ్య ఉండవలసింది అది మనిద్దరి మధ్య లేదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. అంతలోనే అక్కడికి వచ్చిన వసంత ప్లాన్ వర్క్ అవుట్ అయిందా అని అడుగుతాడు. అంతా నీ వల్లే మొత్తం అప్సెట్ అయిపోయింది.

 స్టుపిడ్ ఐడియా ఇచ్చావు అంటూ జరిగిందంతా చెప్తాడు  యష్. చిన్న విషయాన్ని కాంప్లికేట్ చేసి నిన్ను, వదిన్ని హార్ట్ చేశాను సారీ అంటాడు వసంత్. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు నేనే నీకు థాంక్స్ చెప్పాలి, నన్ను చంప దెబ్బ కొట్టింది దెబ్బలాటలో కోపంలో ఉక్రోషంలో నాకు వేరే ఏమీ కనిపించలేదు కేవలం నామీద ప్రేమ మాత్రమే కనిపించింది. ఈరోజు వేద లో నాకు అమ్మ మనసు కనిపించింది.

 ఈరోజు నాకు అర్థమైంది ప్రతి భార్య ఇచ్చిన కంప్లైంట్ వెనుక ప్రేమే ఉంటుందని నేను చాలా లక్కీ. ఇలాంటి చెత్త సలహాలు ఇంకో రెండు మూడు ఇవ్వు నేను ఇంకో రెండు మూడు చెంప దెబ్బలు తినాలని ఉంది అంటాడు  యష్.ఆ మాటలకి ఇద్దరు నవ్వుకుంటారు. ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయిన నాకు ఒక విషయం అర్థం కావట్లేదు.

 నువ్వు యాక్సిడెంట్ అయింది అని వేదని గాంధీ పార్క్ కి రమ్మనగానే అక్కడ వేద ని కిడ్నాప్ చేయడానికి మనుషులు ఉన్నారు ఎలా అంటూ అనుమాన పడతాడు. అదీ నిజమే వదిన ఆ టైంలో గాంధీ పార్క్ కి వస్తుందని మన ఇద్దరికీ మాత్రమే తెలుసు కానీ వాళ్లకు ఎలా తెలిసింది అంటాడు వసంత్. మనకి కాకుండా ఈ విషయం మూడో మనిషికి తెలుసు.

వేదని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఉన్న ఆ మూడో మనిషి ఎవరు అంటాడు యష్. అప్పుడే విన్ని వేద ఫోటో చూస్తూ నవ్వుతుంటాడు. తరువాయి భాగంలో వేద దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు యష్. మీ సారీ కో దండం మీకొక దండం మీ ఆటిట్యూడ్ తో విసిగిపోయాను అంటుంది వేద. ఇది ఇంతటితో వదిలేయ్ అని యష్ అంటే మీరే నన్ను వదిలేయండి అంటుంది వేద.

 తలదింపులు చేసుకోవడానికి నిమిషం పట్టదు అని యష్ అంటే గుండె రాయి చేసుకోవడానికి నాకు ఆరు నిమిషం పట్టదు అంటుంది వేద. నాకు భార్యగా ఉండే అర్హత నీకు లేదు అని యష్ అంటే నాకు భర్తగా ఉండే హక్కు మీకు లేదు అంటుంది వేద. అయితే విడిపోదాం అనుకుంటారు ఇద్దరు.

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు