దారుణం... మెహబూబ్ కండలు చూసి టెంప్ట్ అయిన  ఫైమా అందరి ముందే!

Published : Mar 14, 2023, 11:53 AM ISTUpdated : Mar 14, 2023, 11:59 AM IST
దారుణం... మెహబూబ్ కండలు చూసి టెంప్ట్ అయిన  ఫైమా అందరి ముందే!

సారాంశం

బీబీ జోడి లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.  మెహబూబ్ కండలు చూసి టెంప్ట్ అయిన ఫైమా పెరిగెత్తుకుంటూ వెళ్లి అతని మీద దూకింది.

స్టార్ మా లో ప్రసారం అవుతున్నబీబీ జోడి సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. డాన్సర్స్ గా పోటీ పడుతున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒకరికి మించి మరొకరు పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. వీరిలో మెహబూబ్-శ్రీసత్య ఒక జోడిగా ఉన్నారు. కఠినమైన పాటలు ఎంచుకొని అద్భుతమైన కాస్ట్యూమ్స్, కంపోజిషన్ తో మెహబూబ్, శ్రీసత్య జడ్జెస్ ని ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. తాజా ఎపిసోడ్ కోసం ఆర్య 2 లోని 'ఉప్పెనంత ఈ ప్రేమకీ' సాంగ్ ఎంచుకున్నారు. 

ఈ సాంగ్ కి మెహబూబ్, శ్రీసత్య అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. సెట్ ని బాగా వాడుకుంటూ రొమాన్స్,కెమిస్ట్రీ పంచారు. జడ్జెస్ లో ఒకరైన సదా... బీబీ జోడిని మీరు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారని ప్రశంసించారు. ఇక తరుణ్ మాస్టర్... ఫినాలేకి ట్రైలర్  లా ఉందని మెచ్చుకున్నారు. కాగా ఈ సాంగ్ కోసం మెహబూబ్, శ్రీసత్య స్కై బ్లూ కలర్ కాస్ట్యూమ్ వేశారు. మెహబూబ్ ట్రాన్స్పరెంట్ షర్ట్ వేశాడు. దాంతో అతని బాడీ క్లియర్ గా కనిపిస్తుంది. 

కాగా 'నేను మెహబూబ్ నే చూస్తుండిపోయాను, కండల రాజా' అని ఫైమా కామెంట్ చేసింది. అంతటితో ఆగకుండా పరుగున వెళ్లి మెహబూబ్ మీదకు ఎక్కింది. వేదిక మీద ఉన్న జడ్జెస్, కంటెస్టెంట్స్ ఫైమా చర్యకు స్టన్ అయ్యారు. అనంతరం ట్రాన్స్పరెంట్ షర్ట్ లో మెహబూబ్ కండలు కనిపిస్తున్నాయని శ్రీముఖి, ఫైమా సిగ్గుపడుతూ మాట్లాడుకున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. 

బీబీ జోడిలో ఫైమా-అవినాష్ ఒక జంటగా పోటీపడుతున్నారు. బీబీ జోడి చివరి దశకు చేరింది. కంటెస్టెంట్ మరింత కష్టపడుతున్నారు. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మెహబూబ్ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నాడు. ఫైమా, శ్రీసత్య సీజన్ 6లో పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి సైతం బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినవారే. ఆమె సీజన్ 4లో పాల్గొని రన్నర్ గా నిలిచారు. 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?