సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ లేటెస్ట్ ఫిల్మ్ SSMB28. ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ కు సాలిడ్ అప్డేట్ అందబోతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరోవైపు మహేశ్ లుక్ షాక్ కు గురి చేస్తోంది.
12 సంవత్సరాల తర్వాత SSMB28తో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - దర్వకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రస్తుతం ఇద్దరు వరుస హిట్లను అందుకూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈక్రమంలో వీరి కాంబో కుదరడం.. చకాచకా షూటింగ్ జరుపుకుంటుడటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు చిత్రంపైనా అంచనాలు పెంచేసుకుంటున్నారు. పవర్ ఫుల్ స్టోరీతో మహేశ్ ను త్రివిక్రమ్ తెరపై ప్రజెంట్ చేయబోతున్నారని బలంగా వినిపిస్తోంది. తాజాగా ‘ఎస్ఎస్ఎంబీ28’ నుంచి క్రేజీ బజ్ వినిపిస్తోంది.
ఉగాది పండుగ సందర్భంగా మహేశ్ బాబు SSMB28 నుంచి ఫస్ట్ లుక్ రాబోతుందంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు టైటిల్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. మరో నాలుగుగైదు రోజుల్లో అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మార్చి 22న అప్డేట్ రానుందంటున్నారు. ‘అర్జున్’, ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ సినిమాలో మహేశ్ లుక్ షాకింగ్ గా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే మహేశ్ బాబు ట్రాన్స్ ఫామ్ కు ఫ్యాన్స్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదివరకే ఎస్ఎస్ఎంబీ సెట్స్ నుంచి ఓ ఫొటో లీక్ అయినట్టు తెలుస్తోంది. మహేశ్ బాబు యాక్షన్ సీక్వెన్స్ లో షర్ట్ విప్పేసి ఇచ్చిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే థియేటర్లు బద్దలవ్వాల్సందేనని అంటున్నారు. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
మహేశ్ బాబు సైతం జిమ్ లో హేవీ వర్కౌట్స్ చేస్తూ ఉక్కులాంటి శరీరాన్ని రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాడీ బిల్డ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసి ఇంటర్నెట్ ను షేక్ చేశారు. ఈ క్రమంలో ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతుండటం ‘ఎస్ఎస్ఎంబీ’పై అంచనాలను పెంచేస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఐదారు నెలల్లో షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉందటున్నారు. రీసెంట్ గానే శ్రీలీలా కూడా సెట్స్ లో జాయిన్ అయ్యింది. చిత్రంలో పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా రూపుదిద్దుకుంటోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB29లో నటించబోతున్నారు.