ఆ విషయంలో విజయ్ మహా ముదురు,తెలుగు నిర్మాతలకు ట్విస్ట్

Published : Oct 24, 2018, 11:48 AM IST
ఆ విషయంలో విజయ్ మహా ముదురు,తెలుగు నిర్మాతలకు ట్విస్ట్

సారాంశం

తమిళంలో ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే ఇక్కడ మన తెలుగు దర్శక,నిర్మాతుల ఎలర్ట్ అవుతారు. హీరోలు సైతం ఓ కన్నేసి ఉంటారు. అదే పరిస్దితి తెలుగు సినిమాలకీ ఉంది. తెలుగు  పెద్ద సినిమాలపై తమిళ తంబీల దృష్టి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఎందుకంత ఎలర్ట్ అంటే ..రీమేక్ రైట్స్ కోసమనేది సింపుల్ సమాధానం. 

తమిళంలో ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే ఇక్కడ మన తెలుగు దర్శక,నిర్మాతుల ఎలర్ట్ అవుతారు. హీరోలు సైతం ఓ కన్నేసి ఉంటారు. అదే పరిస్దితి తెలుగు సినిమాలకీ ఉంది. తెలుగు  పెద్ద సినిమాలపై తమిళ తంబీల దృష్టి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఎందుకంత ఎలర్ట్ అంటే ..రీమేక్ రైట్స్ కోసమనేది సింపుల్ సమాధానం. 

కానీ రోజులు మారాయి...ప్రతీ హీరో ప్రక్క భాషలోనూ క్లిక్ అవ్వాలని,మార్కెట్ పెంచుకోవాలని అనుకుంటున్నారు. అందుకే మన తెలుగు హీరోలు తమిళ దర్శకులను ఎంకరేజ్ చేసి అక్కడ మార్కెట్ ని కైవసం చేసుకోవాలని చూస్తూంటే తమిళ హీరోలు సైతం ఇక్కడ మార్కెట్ కోసం తమ సినిమాలు రిలీజ్ రోజే విడుదల కావాలని చూస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే హీరో విజయ్ తాజా చిత్రం సర్కార్  తెలుగు వెర్షన్ గురించి చెప్పేందుకే.

విజయ్ సినిమాలు ఇక్కడ బాగానే ఆడినా ఎందుకనో అతనికి మార్కెట్ రాలేదు. అయితే విజయ్ ప్రయత్నాలు సైతం ఆపటం లేదు. తన సినిమాలు స్ట్రైయిట్ సినిమాల్లా రిలీజ్ రోజే డబ్బింగ్ వెర్షన్ ని విడుదల అయ్యేలా చూస్తున్నాడు. ముఖ్యంగా తుపాకి తెలుగు వెర్షన్ బాగా ఆడిన నాటి నుంచి అతని దృష్టి తెలుగు మార్కెట్ పై పడింది. తెలుగులోనూ మార్కెట్ ఏర్పడితే రెండు భాషలకు కలిసి ఒకేసారి సినిమా చేయచ్చు అనేది బిజినెస్ ఐడియా. అయితే మన నిర్మాతలకు ఇలా డబ్బింగ్ సినిమాలు వల్ల పెద్దగా కలిసొచ్చేదేముంది. 

హిట్టైన సినిమా రీమేక్ రైట్స్ తీసుకుంటే హీరో డేట్స్ తో పాటు..బిజినెస్ పాయింటాఫ్ వ్యూలోనూ కలిసివస్తోందని ప్లాన్. కానీ విజయ్ దానికి ఒప్పుకోవటం లేదు. తన సినిమా తెలుగు రీమేక్ అయితే తనకే నష్టం అన్నట్లు భావిస్తున్నాడు. తన సినిమాని డబ్బింగ్ చేస్తే తను తెలుగు మార్కెట్ లోకి వెళ్లచ్చు కదా అని ప్లాన్. 

అందుకే సర్కార్ తెలుగు సినిమా రైట్స్ తన దగ్గరే పెట్టుకున్నట్లు సమాచారం.  ఆయనే స్వయంగా డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా ఎగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడే మాట తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదైనా విజయ్ ఇలాంటి విషయాల్లో మహా ముదురు అంటున్నారు.

ఇవి కూడా చదవండి.. 

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్