హీరోపై కూతురి కేసు!

Published : Oct 24, 2018, 11:25 AM IST
హీరోపై కూతురి కేసు!

సారాంశం

కన్నడ నటుడు దునియా విజయ్ తరచూ ఏదోక వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్ మీద బయటకొచ్చాడు. అలానే తన ఇద్దరు భార్యలు గొడవ పడుతుండడం కూడా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పుడు విజయ్ ని తన కూతురు ఇబ్బందుల్లో నెట్టేయడం చర్చనీయాంశంగా మారింది. విజయ్ మొదటి భార్యకి మోనిక అనే కూతురు ఉంది. ఆమె వయసు 19 సంవత్సరాలు. ఇటీవల ఆమె తన తండ్రి దునియా విజయ్ తనపై చేయి చేసుకున్నాడని మోనిక కేసు పెట్టింది.

ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్ మాత్రం మోనికని అసలు కొట్టలేదని, ఆమె తల్లి నాగరత్న కావాలని తనపై ఈ విధమైన ఆరోపణలు చేస్తుందని అంటున్నారు.

ఇప్పటికే పలు కేసులతో ఇబ్బందుల్లో ఉన్న విజయ్ కి ఈ కేసు తలనొప్పిగా మారింది. మరి ఇది కోర్టు వరకు వెళ్తుందా..? లేక పరస్పర అంగీకారంతో సద్దుమణుగుతుందా..? అనేది చూడాలి! 

ఇవి కూడా చదవండి.. 

నటుడు విజయ్ అరెస్ట్!

హీరో విజయ్ ఇద్దరు భార్యల సిగపట్టు!

PREV
click me!

Recommended Stories

Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ