విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్.. ''కింగ్ ఆఫ్ ది హిల్''!

By Udayavani DhuliFirst Published Oct 2, 2018, 11:37 AM IST
Highlights

ఈ మధ్య కాలంలో హీరోలు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలోకి కూడా దిగుతున్నారు. ఇప్పటికే అగ్ర హీరోలందరికీ సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు యంగ్ హీరోలు సైతం నిర్మాణ సంస్థలు స్థాపిస్తూ సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. 

ఈ మధ్య కాలంలో హీరోలు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలోకి కూడా దిగుతున్నారు. ఇప్పటికే అగ్ర హీరోలందరికీ సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు యంగ్ హీరోలు సైతం నిర్మాణ సంస్థలు స్థాపిస్తూ సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు.

రీసెంట్ గా సుదీర్ బాబు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ సైతం ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హీరోగా మూడు సినిమాల అనుభవం ఉన్న నటుడు నిర్మాణసంస్థను మొదలుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం అతడు నటించిన'నోటా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ 'కింగ్ ఆఫ్ ది హిల్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ లోగోని విడుదల చేశాడు. మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రమోషన్ విషయంలో విజయ్ దేవరకొండ ఫాలో అయ్యే స్ట్రాటజీలు మిగిలిన హీరోలకి ఛాలెంజింగ్ గా మారాయి.

మొన్నా మధ్య రౌడీ క్లబ్ అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి తన అభిమానులను అందులో జాయిన్ అవ్వాలని కోరారు. సొంతంగా దుస్తుల బ్రాండ్ ని ప్రారంభించబోతున్న అతడు దానికి రౌడీ క్లబ్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు నిర్మాణ సంస్థ మొదలుపెట్టాడు. 
 

సంబంధిత వార్తలు.. 

సినిమా రిలీజ్ ఆపడానికి చాలా చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?

రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?

 

click me!