'మణికర్ణిక' ట్రైలర్.. అంచనాలను అందుకోలేకపోయింది!

Published : Oct 02, 2018, 11:03 AM IST
'మణికర్ణిక' ట్రైలర్.. అంచనాలను అందుకోలేకపోయింది!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో కంగనా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో కంగనా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 కానీ సినిమా ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను తగ్గించే విధంగా ఉంది. అమితాబ్ బచ్చన్ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ లో ఝాన్సీ లక్ష్మీబాయ్ ధైర్య సాహసాలు, బ్రిటీష్ వారితో ఆమె పోరాట ఘట్టాలను చూపించారు. 

డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ట్రైలర్ సాగింది. కంగనా లుక్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ పోరాట సన్నివేశాల్లో ఆమె హావభావాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాలో మేజర్ పార్ట్ క్రిష్ డైరెక్ట్ చేయగా.. చివర్లో ప్యాచ్ వర్క్ కి దర్శకత్వం వహిస్తోంది కంగనా. వచ్చే ఏడాది జనవరి 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?