
విజయ్ దేవరకొండ(Vijay Devara Konda)సినిమాలలోనే కాదు బయట కూడా చాలా డిఫరెంట్. తనతో పాటు తనచుట్టూ... ఉన్నవాళ్లు బాగుండాలి అని కోరకుంటాడు. సహాయం చేయడంలో.. పెద్ద పెద్ద స్టార్స్ ను మించి ఆదుకుంటాడు విజయ్. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్ లో మాత్రం ఎక్కడ తగ్గేదే లే అంటున్న విజయ్.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. పండగ కానుకగా పేదవారికి 10 లక్షలు ప్రకటించాడు.
విజయ్ దేవరకొండ(Vijay Devara Konda) పండగ కానకు ఇవ్వబోతున్నారు సరే ఈ కానుకు ఎవరికి ఇవ్వబోతున్నాడు..? క్రిస్ మస్, న్యూ ఇయర్ సందర్భంగా..తన తరపు నుంచి 100 మందికి ఒక్కొక్కరికి 10 వేల చొప్పున సహాయం చేయబోతున్నట్టు ప్రకటించాడు. అయితే ఇది బాగా అవసరం ఉన్నవారికి.. పండగ కూడ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు. అర్జెంట్ అవసరం ఉన్నవాళ్లు మాత్రమే తీసుకోవాలని రిక్వెస్ట్ చేశాడు విజయ్. దీని కోసం ఓ ఫార్మెట్ ను కూడా ప్రకటించాడు రౌడీ హీరో.
బాగా అవసరం ఉన్నవాళ్లు.. వాళ్ళ మెయిల్ ఐడి నుంచి రౌడీ క్లబ్ లో రిజిస్టర్ కావాలని సూచించాడు విజయ్. దానికి సంబంధించి మెకానిజంను క్లియర్ గా చెపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విజయ్ ఇలా సాయం చేయడం ఇప్పుడు కొత్తేం కాదు. కోవిడ్ పీక్స్ లో ఉన్నప్పుడు.. మిడిల్ క్లాస్ వారిని ఆదుకోవడానికి మిడిల్ క్లాస్ ఫండ్ ను పెట్టాడు. వారికి కావల్సిన కిరాణ సరుకులు, రౌడీ క్లబ్ వాలంటీర్స్ తో ఇంటికే పంపించాడు. ఇలా ప్రతీ విషయంలో తన వంతు సాయం అందిస్తూనే ఉన్నాడు విజయ్.
Also Read :Sunny Leone: సన్నీ లియోన్ క్షమాపణలు చెప్పు.. బ్రహ్మణ సంఘాల డిమాండ్. సన్నీ ఏం చేసింది..?
ప్రస్తుతం విజయ్ దేవరకొండ( Vijay Devara Konda) పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ మూవీ చేస్తున్నాడు. హాలీవుడ్ స్టార్ మైక్ టైసన్ నటిస్తున్న ఈమూవీని పూరీతో పాటు.. బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది అగస్ట్ 25న సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ తరువాత సుకుమార్(Sukumar) , శివ నిర్వాణతో సినిమా కమిట్ అయ్యాడు విజయ్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్న రౌడీ హీరో.. తెలంగాణాలో టికెట్ రేట్స్ పెంచుకునే వీలు కల్పించినందకు ప్రభుత్వానికి థ్యాక్స్ చెపుతూ ఈరోజు ట్వీట్ కూడా చేశారు.