సమంత లీడ్ రోల్ చేస్తున్న సినిమా యశోద. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఈమూవీ ఫస్ట్ షెడ్యుల్ ను కంప్లీట్ చేసుకున్నారు సమంత. సూపర్ ఫాస్ట్ గా మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడానికి నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
వరుస సినిమాలతో దూసుకుపోతోంది సమంత(Samantha).ఎక్కువగా విమెన్ సెంట్రిక్ మూవీస్ ను చేసుకుంటూ.. ఇండస్ట్రీలో తనదైన మార్క్ ను చూపిస్తోంది సమంత. ఇప్పటికే ఓ బేబీ లాంటి సినిమాలతో సమంత సత్తా చాటింది. అటు గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం(Sakunthalam) చేస్తున్నారు సమంత. ఆ మూవీతో పాటు యశోద(yashoda) అనే మరో విమెన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు సమంత.
హరి - హరీష్ ఇద్దరు దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో.. తమిళ స్టార్ వరలక్ష్మీ శరత్ కుమార్ తో పాటు, మలయాళ యంగ్ స్టార్ ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యశోద సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేశారు టీమ్. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఒకే సారి రిలీజ్ చేస్తాం. ఈ నెల 6న `యశోద` మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందన్నారు.
సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ లాంటి స్టార్ కాస్ట్ తో హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు టీమ్. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు రావు రమేష్, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. జనవరి 3న యశోద రెండో షెడ్యూల్ ప్రారంభించి 12 వరకూ కంప్లీట్ చేయబోతున్నారు. దానితో పాటు మూడో షెడ్యూల్ జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు.
Also Read : 2021 మిస్ అయినా... నెక్ట్స్ ఇయర్ అంతకు మించి ట్రీట్ ఇస్తామంటున్న స్టార్ హీరోలు
ఇలా నిర్విరామంగా షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసి, షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నారు టీమ్. విజువల్‌గా, టెక్నికల్‌గా సినిమా చాలా గ్రాండియర్‌గా ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు మూవీ టీమ్. యశోద మూవీకి మ్యూజిక్ మణిశర్మ అందిస్తున్నారు రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు.