హైపర్‌ ఆది అన్నట్టే అయ్యింది.. సుడిగాలి సుధీర్‌ గాలోడయ్యాడుగా!

Published : Dec 25, 2021, 08:03 PM IST
హైపర్‌ ఆది అన్నట్టే అయ్యింది.. సుడిగాలి సుధీర్‌ గాలోడయ్యాడుగా!

సారాంశం

`సాఫ్ట్ వేర్ సుధీర్‌` చిత్రంలో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. మరోవైపు `త్రీమంకీస్‌` అనే మరో చిత్రంలోనూ నటించారు సుధీర్‌. ఇప్పుడు సోలోగా మరో సినిమాతో రాబోతున్నాడు.

`జబర్దస్త్` షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్‌. `జబర్దస్త్` తన టీమ్‌ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారు. సుధీర్‌కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర స్టేట్స్ లోనూ ఫాలోయింగ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. `జబర్దస్త్`లో తన టీమ్‌ రామ్‌ ప్రసాద్‌, గెటప్‌ శ్రీనుతో కలిసి ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. తనదైన డబుల్‌ మీనింగ్‌ డైలాగ్ లతో, కామెడీ స్కిట్లతో ఆద్యంతం నవ్వులు పూయిస్తుంటాడు. దీనికితోడు యాంకర్‌ రష్మితో పులిహోర కలుపుతూ, ఆమెతో షోలో డాన్సులతో, లవ్‌ ప్రపోజ్‌లతో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. 

`జబర్దస్త్` షోతోపాటు `ఢీ`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` వంటి షోల ద్వారాను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు సుడిగాలి సుధీర్‌. `ఢీ` షోలో ముఖ్యంగా హైపర్‌ ఆది, సుధీర్‌ల జోడీ బాగా క్లిక్‌ అయ్యింది. వీరికి అపోజిట్‌గా ఉన్న ఫీమేల్స్ గా రష్మి, దీపికా పిల్లిలతో చేసే సందడి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ టీవీ షోస్‌ ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి సుధీర్‌కి. ఇప్పటికే ఆయన హీరోగా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. `సాఫ్ట్ వేర్ సుధీర్‌` చిత్రంలో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. మరోవైపు `త్రీమంకీస్‌` అనే మరో చిత్రంలోనూ నటించారు సుధీర్‌. 

ఇప్పుడు సోలోగా మరో సినిమాతో రాబోతున్నాడు. `ఢీ` షోలో హైపర్‌ ఆది.. `అది మన వల్ల కాదు ఆ గాలోడి వల్లే` అవుతుందని పలుమార్లు డైలాగ్‌లు కొట్టాడు. ఆ డైలాగ్‌ బాగా ఫేమస్‌ అయ్యింది. నిజంగానే సుడిగాలి సుధీర్‌ని గాలోడు చేసింది. ఎందుకంటే అదే పేరుతో సుధీర్‌ ఏకంగా సినిమా చేస్తున్నారు. ఆయన హీరోగా `గాలోడు` పేరుతో ఓ సినిమా తెరకెక్కుతుంది. తనకు `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌` చిత్రాన్ని అందించిన రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సుధీర్‌ బర్త్ డే కానుకగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. తాజాగా క్రిస్మస్‌ కానుకగా మరో కొత్త లుక్‌ని విడుదల చేశారు. ఇందులో సుధీర్‌ సిగరేట్‌ తాగుతూ ఉన్న స్టయిలీష్‌ లుక్‌ అదరగొడుతుంది. 

సంస్కృతి ఫిలింస్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ, `మాస్‌లో సుడిగాలి సుధీర్‌కి ఎంత ఇమేజ్ ఉందో చెప్ప‌డానికి  మా `సాఫ్ట్‌వేర్ సుధీర్` చిత్రానికి వ‌చ్చిన భారీ ఓపెనింగ్స్ నిద‌ర్శ‌నం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రూపొందిస్తున్నాం. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఓ పెద్ద స్టార్‌ హీరో చేతుల మీదుగా చిత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నాం. ఈ మూవీకి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం` అని అన్నారు. 

ఇదిలా ఉంటే ఇటీవల తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి, టీవీ షోస్‌ చేయడానికి సమయం సరిపోవడం లేదని, `జబర్దస్త్` షోకి సుధీర్‌ టీమ్‌ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అలాగే `ఢీ` షో నుంచి కూడా తప్పుకున్నారు. దీంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో హీరోగా మారిపోయి సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సుధీర్‌ చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్ లున్నట్టు టాక్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌