టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్!

Published : Oct 03, 2018, 02:06 PM IST
టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో ఎదిగిన హీరోలు ఎందరో.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీలోనైనా వారసత్వంతో హీరోలుగా కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు. టాలీవుడ్ లో కూడా ఈ వారసత్వం అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది.

సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో ఎదిగిన హీరోలు ఎందరో.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీలోనైనా వారసత్వంతో హీరోలుగా కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు. టాలీవుడ్ లో కూడా ఈ వారసత్వం అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఒకప్పుడు హీరోల కొడుకులు మాత్రమే హీరోలు అయ్యేవారు. కానీ ఇప్పుడు వారి అల్లుళ్లు, మేనల్లుడు ఇలా వారితో బంధాలున్న వారంతా హీరోలవుతున్నారు.

ఈ నేపధ్యంలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా ఎదిగిన వారు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఆ లిస్టులో హీరో నాని తరువాత నటుడు విజయ్ దేవరకొండ ఉంటాడు. చాలా తక్కువ సమయంలో స్టార్ హోదాని దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన నటించిన 'నోటా' సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ''సినిమా అనేది వ్యాపారం. ఒకరిపై డబ్బు పెట్టి సినిమా తీస్తున్నారంటే నిర్మాత ఆలోచించడంలో తప్పేముంది. బ్యాగ్రౌండ్ ఉన్న హీరో అయితే ఫ్యాన్స్ సపోర్ట్ తో పాటు.. సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయి.

బ్యాగ్రౌండ్ లేని హీరోలతో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాతలు వారసత్వ హీరోలపైనే మక్కువ చూపుతుంటారని'' చెప్పుకొచ్చాడు. ఇక తనలా కొద్దిమందికి మాత్రమే ఎదిగే ఛాన్స్ వస్తుందని అది అదృష్టమని అన్నారు. 

సంబంధిత వార్తలు.. 

సినిమా రిలీజ్ ఆపడానికి చాలా చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?

రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?

 

PREV
click me!

Recommended Stories

Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది
Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?