'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!

By Udayavani DhuliFirst Published Oct 3, 2018, 12:58 PM IST
Highlights

దర్శకుడు త్రివిక్రమ్ ఎలాంటి కథను ఎంపిక చేసుకున్నా.. అందులో కామెడీ ఎలిమెంట్స్ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడు. హీరోలతో కూడా కామెడీ చేయించి సక్సెస్ అందుకున్న రోజులు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం తన సినిమాలో కామెడీ డోస్ బాగా తగ్గించాడని తెలుస్తోంది. 

దర్శకుడు త్రివిక్రమ్ ఎలాంటి కథను ఎంపిక చేసుకున్నా.. అందులో కామెడీ ఎలిమెంట్స్ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడు. హీరోలతో కూడా కామెడీ చేయించి సక్సెస్ అందుకున్న రోజులు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం తన సినిమాలో కామెడీ డోస్ బాగా తగ్గించాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందో ఓ అంచనాకు వచ్చేశారు ప్రేక్షకులు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొత్తం ఎమోషనల్ గా సాగుతుందని అంటున్నారు. 

ఫస్ట్ హాఫ్ లో సాగే లవ్ ట్రాక్ మాత్రం సరదాగా ఉంటుందని, సెకండ్ హాఫ్ నుండి సినిమా మొత్తం ఓ యాక్షన్ సీన్, దాని వెంటనే ఓ సెంటిమెంట్ సీన్ ఇలాంటి సాగుతుందని సమాచారం. అక్కడక్కడా సునీల్ కామెడీ చేసినా.. యాక్షన్ సన్నివేశాలే ప్రధానంగా సాగుతాయని చెబుతున్నారు. ఫన్ లేకుండా తన సీరియస్ డైలాగులతోనే సినిమా మొత్తం నడిపించబోతున్నాడట త్రివిక్రమ్.

అందుకే ట్రైలర్ లో కూడా కామెడీ ఎలిమెంట్స్ పెద్దగా కనిపించకుండా.. సినిమా సీరియస్ గా ఉండబోతుందని ఆడియన్స్ ని ముందే ప్రిపేర్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి!

సంబంధిత వార్తలు.. 

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!

కళ్యాణ్ రామ్ స్పీచ్ తో ఏడ్చేసిన ఎన్టీఆర్!

ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం.. 'అరవింద సమేత' ట్రైలర్ టాక్!

click me!