నాగ్ గాడు ఒక్క చైన్ లాగి క్రెడిట్ కొట్టేశాడు-వెంకటేశ్

Published : Dec 21, 2016, 10:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నాగ్ గాడు ఒక్క చైన్ లాగి క్రెడిట్ కొట్టేశాడు-వెంకటేశ్

సారాంశం

వంగవీటి ఆడియో వేడుక శివ టు వంగవీటి ది జర్నీ ఆఫ్ ఆర్జీవీలో వెంకీ శివ క్రేజ్ గురించి ఆ రోజుల్లో కుళ్లుకునేవాళ్లమన్న విక్టరీ హీరో నాగార్జున చైన్ లాగి క్రేజ్ కొట్టేశాడని అంతా అనుకునేవాళ్లమన్న వెంకటేష్

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వంగవీటి' డిసెంబర్‌ 23న రిలీజ్‌ అవుతున్న సందర్భంగా వర్మ 'శివ టు వంగవీటి ది జర్నీ ఆఫ్‌ రామ్‌ గోపాల్‌ వర్మ' అంటూ హైదరాబాద్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించాడు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా నాగార్జున, వెంకటేష్‌ సహా పూరి జగన్నాథ్‌,బోయపాటి, గుణశేఖర్‌, వై.వి.ఎస్‌.చౌదరి, వంశీ పైడిపల్లి, జీవిత, డా.రాజశేఖర్‌ సహా పలువురు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ...'శివ' సినిమా తర్వాత వర్మతో ఓ సినిమా చేయాలని అనుకున్నాం. శివ లాంటి సినిమా తీస్తాడని అనుకున్నాను. శివ కన్నా బాబులాంటి సినిమా తీస్తాడని అనుకున్నాను. కానీ 'క్షణం క్షణం' అనే డిఫరెంట్ సినిమా తీసాడు. ఓ రోజు రామ్ గోపాల్ వర్మ నా దగ్గరికి వచ్చి....... శ్రీదేవితోనే ఎక్కువ సీన్స్ చేస్తున్నాడు. నీతో తక్కువ సీన్స్ ఉన్నాయని బయట అనుకుంటున్నారు. నువ్వేమైనా ఫీలయ్యావా..? అలాంటిదేమైనా ఉంటే చెప్పు అని రాము అడిగారు. అలాంటిదేమీ లేదని చెప్పా అని వెంకీ గుర్తు చేసుకున్నారు.

 

ఇక శివ తర్వాత నాగార్జున సాధించిన క్రేజ్ గురించి ఆ రోజుల్లో కుళ్లుకునేవాళ్లమని వెంకటేష్ చెప్పాడు. మిగిలిన హీరోలందరం కలిసినప్పుడు మనం ఎన్ని ఫైట్స్‌ చేసినా నాగ్‌గాడు ఒక్క ఛైన్‌ లాగి మొత్తం కొట్టేసాడ్రా అనుకునేవాళ్లం. శివ తర్వాత నుంచి ఫైట్స్‌ స్టైలే మారిపోయింది.. అని వెంకటేశ్  పాత రోజులను గుర్తు చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్