పెళ్లి వార్తలను ఖండించిన మల్లిక

Published : Dec 21, 2016, 10:02 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
పెళ్లి వార్తలను ఖండించిన మల్లిక

సారాంశం

మల్లికా షెరావత్ పెళ్లి చేసుకుందనీ ప్రచురించిన ఆంగ్ల పత్రిక పెళ్లి వార్తలను ఖండించిన మల్లిక తానింకా సింగిలేనని స్పష్టం చేసిన బాలీవుడ్ సెక్స్ బాంబ్

మర్డర్, హిస్, దశావతారం వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నాయకి మల్లికా షెరావత్.. కేవలం బాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా ఇంగ్లీష్, చైనీస్ చిత్రాల్లో కూడా నటించారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టిన మల్లికా షెరావత్ తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోందని.. ఆమెకు రహస్యంగా వివాహం కూడా అయిపోయిందంటూ ఓ ఇంగ్లీష్ పత్రిక రాసింది.

 

దీనిపై మల్లికా షెరావత్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. తనకు పెళ్ళి కాలేదని.. అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేశారు. ‘దయ చేసి పుకార్లను ఆపండి. నేను రహస్య వివాహం చేసుకోలేదు. నా గురించి అసత్య వార్తలను ప్రచారం చేయడం తగదు’ అని ట్విట్టర్‌ వేదికగా కోరారు.

 

ఈ వార్తలకు డీఎన్ఏ ఇండియా అనే పేపర్ మాత్రమే బాధ్యత వహించాలని మల్లికా షెరావత్ తెలిపింది. అనవసరంగా అసత్యపు వదంతులను ప్రచారం చేయవద్దని మల్లికా షెరావత్ విజ్ఞప్తి చేశారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్