అవికాకు యాక్టింగ్ బోర్ కొట్టిందట

Published : Dec 21, 2016, 09:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
అవికాకు యాక్టింగ్ బోర్ కొట్టిందట

సారాంశం

అవికా గోర్ కు యాక్టింగ్ పై విసుగు పుటిటందా.. టాలీవుడ్ హీరో విసిగిస్తున్నందుకేే బ్రేక్ కావాలంటోందా అవున. అవిక ఇప్పుడు అన్నీ మానేసి ఒంటరిగా ఉంటోందట

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా అందరి మనసులను గెలుచుకుని, బుల్లితెరతో వచ్చిన క్రేజ్‌తోనే తెలుగులో ‘ఉయ్యాల జంపాల’తో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ కావటం, తర్వాత కొన్ని వరుస అవకాశాలు వచ్చినా వదులుకుంది. తదుపరి ఆమె చేసిన సినిమా ‘సినిమా చూపిస్త మావ’. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి పేరు తెచ్చుకుంది. అయితే  ట్రాక్ ఇంత స్వింగ్ లో ఉన్నా... అవిక సినిమాలకి కొంత కాలం పాటు విరామం ఇవ్వాలనుకుంటోంది.

అవికాగౌర్ చిన్నప్పటి నుంచి నటిస్తోంది. దాంతో ఆమెకు ఈ బిజీబిజీ జీవితం మీద అవికా కి విసుగు పుట్టిందట. ఆమెకు అటు ముంబాయిలోనూ, ఇటు హైదరాబాద్ లోనూ చేదు అనుభవాలు తప్పలేదు. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో ఆమెను వేధించాడనే వార్త ఇటీవల సంచలనం సృష్టించింది.

 

అవిక తెలుగు సినీ పరిశ్రమలో పని చేయాలంటేనే విరక్తి కలుగుతోందని, తోటి నటీమణులతో హీరోలు ప్రవర్తించే తీరు ఏ మాత్రం బాగోవడం లేదంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా పరిశ్రమ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నదేమిటంటే, ఆమె అందరికీ దూరంగా ముంబాయిలో ఒంటరిగా ప్రశాంతంగా వుంటోందని తెలిసింది. ఇటీవల 18ఏళ్లు దాటి 19 రాగానే, మైనారిటీ తీరగానే తల్లితండ్రులకు కూడా దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు ప్రశాంతంగా జీవించిన తరువాతే కెరీర్ పై మళ్లీ దృష్టి పెట్టడమా, ఏం చేయడమా? అన్నది డిసైడ్ చేసుకోవాలన్నది అవికా ఆలోచనగా తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

ఓటీటీలో మీకోసం వీకెండ్‌ లో దుమ్మురేపే 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర