ప్రభాస్ ను వదిలేది లేదంటున్న వరలక్ష్మి శరత్ కుమార్

Published : Oct 21, 2017, 08:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ప్రభాస్ ను వదిలేది లేదంటున్న వరలక్ష్మి శరత్ కుమార్

సారాంశం

తెలుగులో కనిపించబోతున్న వరలక్ష్మి తమిళంలో హిరోయిన్ గా సక్సెస్ అయిన శరత్ కుమార్ కూతురు తెలుగు హీరోల్లో బాహుబలి ప్రభాస్ అంటే ఇష్టమని వెల్లడి

తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలి చిత్రం కేవలం కలెక్షన్స్ పరంగానే కాక... దర్శకుడు రాజమౌళికి, హీరో ప్రభాస్ కు కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ మూవీతో హీరో ప్రభాస్ కు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనటంలో ఎలాంటి సందేహం లేదు.

 

అసలు బాహుబలి చిత్రం ముందు ప్రభాస్ వేరు. ఆతర్వాత ప్రభాస్ వేరు. ప్రభాస్ ఒక్కసారిగా సినీ ఐకాన్‌గా మారిపోయారు. బాలీవుడ్‌తోపాటు పలు భాషల్లో సినీ ప్రముఖుల దృష్టి యంగ్ రెబల్ ‌స్టార్‌పై పడింది. ప్రభాస్‌తో ఒక్క సినిమాలోనైనా నటింప చేయాలనే సినీ నిర్మాతల క్యూ భారీగానే పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి వెల్లువలా ఆఫర్లు వచ్చి పడ్డాయి. అయినా ప్రభాస్ చెక్కుచెదర్లేదు. ఇదంతా నాణానికి మరో వైపు.. ఇక అసలు విషయానికి వస్తే గతంలో ప్రభాస్‌తో నటించడానికి ముఖం చాటేసినా హీరోయిన్లు ఇప్పుడు ఆయన నటించాలని తహతహలాడుతుండటం గమనార్హం. తాజాగా తమిళ స్టార్ శరత్ కుమార్ కూతురు కూడా ఈ జాబితాలో చేరింది.

 

తమిళంలో హీరోయిన్‌గా కొనసాగుతోన్న వరలక్ష్మి ‘శక్తి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రభాస్‌తో కలిసి నటిస్తారా? అని చాలామంది అడుగుతున్నారు. ఆయనతో నటించాలని అందరూ అనుకుంటారు. ఆ అవకాశం వస్తే ఏ హీరోయిన్‌ మాత్రం వదులుకుంటుంది. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ నటన సూపర్బ్‌. నాకు చాలా బాగా నచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ వంటి టాలెంట్‌ ఉన్న నటులున్నారు. వారితోనూ సినిమాలు చేయాలనుంది’’ అన్నారు.

PREV
click me!

Recommended Stories

Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?