మెర్సల్ సునామీ... వివాదాల హోరు.. కలెక్షన్స్ జోరు

Published : Oct 21, 2017, 07:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
మెర్సల్ సునామీ... వివాదాల హోరు.. కలెక్షన్స్ జోరు

సారాంశం

విజయ్ మెర్సల్ వివాదాస్పద డైలాగులపై బీజేపీ నేతల ఆగ్రహం మరోవైపు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తున్న మెర్సల్

ఇళయదళపతి విజయ్ నటించిన మెర్సల్ చిత్రం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ఒక వైపు కలెక్షన్లతో దూసుకెళ్తుంటే మరోవైపు వివాదాలు ముసురుకుంటున్నాయ్. దర్శకుడు అట్లీ రాసిన డైలాగ్‌ల కు.. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. జీఎస్టీపైన ఈ చిత్రంలోని డైలాగులు, డిజిటల్ ఇండియాపై చెప్పిన డైలాగులపై బీజేపీ నేతలు అభ్యంతరాలు చెప్తుండటంతో మెర్సల్ వివాదం మరింత రాజుకుంటోంది.

 

ఈ సినిమాలో సింగపూర్‌, భారత్‌లో అమలవుతున్న మెడికల్ ట్యాక్స్‌లపై ప్రశ్నలు సంధించారు. సింగపూర్‌లో 7శాతం జీఎస్టీ వసూలు చేసి ప్రజలకు ఉచితంగా వైద్యమందిస్తుంటే ఇండియాలో మాత్రం 28శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నా... ఉచిత వైద్యం మాత్రం అందడం లేదన్నారు. అంతేకాదు హాస్పిటల్‌కు వెళితే ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా దొరకడం లేదంటూ డైలాగ్‌లు పేల్చారు. ఆరోగ్యానికి హానికరమైన మద్యంపైన మాత్రం జీఎస్టీ వేయలేదని పంచ్‌లు విసిరారు.

 

దీంతో ఈ మూవీలో జీఎస్టీ, డిజిటల్ ఇండియాపై సెటైర్లు వేస్తూ చెప్పిన డైలాగ్‌లను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విజయ్‌ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని... అందుకే తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలు తమిళ్‌సాయి సౌందరరాజన్ విమర్శించారు.

 

ఇక విమర్శలు, పొగడ్తలు ఇలా వుంటే.. మెర్సల్ మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 18న విడుదలైన.. మెర్సల్ భారీగా ఓపెనింగ్‌ కలెక్షన్లు సాధించింది. వివాదాలను దాటుకుని భారత్‌లో 2500 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా...తొలిరోజు 31.3 కోట్ల వసూళ్లు సాధించినట్టు ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఒక్క చెన్నైలోనే తొలిరోజు రూ.1.52 కోట్లు సాధించినట్టు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు మొత్తం 18-19 కోట్ల బిజినెస్‌ వచ్చినట్లు తెలిపాయి. ఓవర్సీస్ అన్నీ కలిపి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు