
మాస్ మహారాజ్ రవితేజ అభిమానులు రాజా ది గ్రేట్ సక్సెస్ తో మాంచి జోష్ లో వున్నారు. బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫ్లాపులు చవిచూసిన రవితేజ ఫ్యాన్స్ రాజా దిగ్రేట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే... రవితేజ అంథుడి పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ సాధించింది.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మూడో రోజు రూ.3.47కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. దీంతో మూడు రోజులు వసూళ్లు కలిపి రూ.12.91 కోట్లకు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా రూ.20కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన రాజా ది గ్రేట్... ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.26.5కోట్ల గ్రాస్ వసూళ్లతో రూ.16కోట్ల షేర్ సాధించింది.
ఇక ఆదివారం సెలవు రోజు కావటంతో... మిక్స్డ్ రివ్యూలు రావటమే కాక ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వస్తుండటంతో.. సండే కలెక్షన్స్ పరంగా మాంచి గ్రోత్ వుంటుందని..