Bangarraju: వాసివాడి తస్సాదియ్యా…దీని స్పీడ్ కు దండాలయ్యా

Surya Prakash   | Asianet News
Published : Dec 20, 2021, 08:30 AM IST
Bangarraju: వాసివాడి తస్సాదియ్యా…దీని స్పీడ్ కు దండాలయ్యా

సారాంశం

‘నువ్వు పెళ్లి చేసుకెళ్లిపోతే బంగార్రాజు’ అంటూ ప్రారంభమైన ఈ పాటను చిత్ర యూనిట్ ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా ప్రమోట్ చేస్తోంది. లిరికల్ సాంగ్ చూస్తే  ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ కు తగ్గట్లే ఉంది.  

నాగార్జున - నాగచైతన్య కాంబినేషన్లో 'బంగార్రాజు' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు కంటిన్యూగా జరుగుతోంది. నాగార్జున సరసన హీరోయిన్ గా రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది.

గ్రామీణ నేపథ్యంలో పల్లెటూరి బుల్లోడుగా నాగార్జున కనిపించనుండగా, ఆయన వారసుడైన బుల్లి బంగార్రాజుగా చైతూ అలరించనున్నాడు. ఇద్దరూ రొమాంటిక్ హీరోలుగానే సందడి చేయనున్నారు. ఈ సినిమాలో రెండు ఐటమ్ సాంగ్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఫరియా అబ్దుల్లా - చైతూ పై ఒక ఐటమ్ సాంగ్ ను షూట్ చేసారు. ఆ ఐటమ్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ పూర్తి స్గాంగ్ ను  విడుదల చేసారు. 

‘నువ్వు పెళ్లి చేసుకెళ్లిపోతే బంగార్రాజు’ అంటూ ప్రారంభమైన ఈ పాటను చిత్ర యూనిట్ ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా ప్రమోట్ చేస్తోంది. లిరికల్ సాంగ్ చూస్తే  ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ కు తగ్గట్లే ఉంది. ఈ పాటకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణనే లిరిక్స్ అందించడం మరో విశేషం.

‘వాసివాడి తస్సాదియ్యా, పిల్ల జోరు అదిరిందయ్యా… వాసివాడి తస్సాదియ్యా, దీని స్పీడ్ కు దండాలయ్యా’ అంటూ మధ్యలో హీటెక్కించారు నాగ్. ఇక మరో ఐటమ్ సాంగ్ లో దీక్ష నగర్కార్ మెరవనుందని, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి  స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందని అంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Also read BiggBoss Telugu 6: బిగ్‌బాస్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఆరో సీజన్‌ ఎప్పట్నుంచంటే.. క్లారిటీ ఇచ్చేసిన నాగ్‌

ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైత‌న్య (Naga Chaitanya) స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) న‌టిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?