Bigg boss telugu 5: సిరి హన్మంత్ రెమ్యూనరేషన్ లీక్... 15 వారాలకు ఆమె ఎంత తీసుకున్నారంటే!

Published : Dec 20, 2021, 07:59 AM IST
Bigg boss telugu 5: సిరి హన్మంత్ రెమ్యూనరేషన్ లీక్... 15 వారాలకు ఆమె ఎంత తీసుకున్నారంటే!

సారాంశం

సిరి, శ్రీరామ్, మానస్ ఫైనలిస్ట్స్ అన్న విషయం తెలిసిందే. వీరికి కేవలం వాళ్ళ రెమ్యూనరేషన్ మాత్రమే దక్కింది. మానస్, శ్రీరామ్ లకు నాగార్జున డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి వైదొలిగే అవకాశం ఇచ్చాడు. 

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే (Bigg boss telugu5 grand finale) ముగిసింది. టైటిల్ విన్నర్ గా విజె సన్నీ అవతరించారు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్-సన్నీ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీపడ్డారు. ఇక ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేత నిర్ణయం జరిగిపోయింది, కేవలం నేను ప్రకటిస్తున్నాను అంతే అని నాగార్జున తెలియజేశారు. ఉత్కంఠ మధ్య సన్నీని విన్నర్ గా ప్రకటించడం జరిగింది. 

సన్నీ(Sunny) కి బిగ్ బాస్ ట్రోపీతో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ, రూ. 25 లక్షలు విలువ చేసే 300 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్, ఒక అపాచీ బైక్ దక్కాయి. ఇక ఆయన 15 వారాల రెమ్యూనరేషన్ అదనంగా అందనుంది. దీంతో దాదాపు ఒక కోటి రూపాయల వరకు సన్నీ విజేతగా గెలుపొందినట్లయింది. రన్నర్ షణ్ముఖ్ బాగా నిరాశ చెందినట్లు కనిపించారు. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 స్పానర్స్ లో ఒకరైన సువర్ణభూమి యజమానిని రన్నర్ షణ్ముఖ్(Shanmukh) కి కూడా ఏమైనా ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు. దానికి ఆయన అంగీకరించారు. షణ్ముఖ్ కి ఎంతో కొంత ప్లాట్ అరేంజ్ చేయనున్నట్లు తెలియజేశారు. 

కాగా సిరి, శ్రీరామ్, మానస్ ఫైనలిస్ట్స్ అన్న విషయం తెలిసిందే. వీరికి కేవలం వాళ్ళ రెమ్యూనరేషన్ మాత్రమే దక్కింది. మానస్, శ్రీరామ్ లకు నాగార్జున డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి వైదొలిగే అవకాశం ఇచ్చాడు. గెలుస్తామనే నమ్మకంతో పాటు ఓట్లు వేసిన అభిమానులు బాధపడతారన్న నెపంతో మానస్, శ్రీరామ్ ఆ ఆఫర్స్ తీసుకోలేదు. ఈ ఫైనలిస్ట్స్ కి ఎటువంటి ప్రైజ్ మనీ దక్కకపోయినా... 15 వారాలు రెమ్యూనరేషన్ పొందుతారు. 

Also read BiggBoss Telugu5 grand finale:సన్నీని కోటీశ్వరుడిని చేసిన బిగ్ బాస్ షో.. విన్నర్ గా అతడికి దక్కింది ఎంతంటే!

ఫైనలిస్ట్స్ లో 5వ స్థానంతో సరిపెట్టుకున్న సిరి రెమ్యూనరేషన్ గురించి సమాచారం అందుతుంది. ఆమెకు నిర్వాహకులు వారానికి రూ. 1.5 నుండి 2.0 లక్షలు రూపాయలు ఆఫర్ చేశారట. అలా ఆమెకు రూ. 25 లక్షల వరకు పొందారని సమాచారం. ఫైనల్ లో తన ఎలిమినేషన్ కంటే కూడా షణ్ముఖ్ టైటిల్ కోల్పోవడమే ఆమెను ఎక్కువ బాధకు గురి చేసింది. 

Also read BiggBoss Telugu 6: బిగ్‌బాస్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఆరో సీజన్‌ ఎప్పట్నుంచంటే.. క్లారిటీ ఇచ్చేసిన నాగ్‌

PREV
click me!

Recommended Stories

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?