Pushpa:సుకుమార్… నిన్ను తగలెయ్యా..! బన్నీ కామెంట్

Published : Dec 20, 2021, 07:21 AM IST
Pushpa:సుకుమార్… నిన్ను తగలెయ్యా..! బన్నీ కామెంట్

సారాంశం

 ‘నిన్ను తగలెయ్యా’ ఎందుకింత టెన్షన్ పెట్టావు అని తాను లోలోన అనుకునేవాడినని, దీనికి సుకుమార్ నన్ను క్షమించాలని నవ్వుతూ చెప్పేసారు బన్నీ.  

ఎక్కడ చూసినా పుష్ప గురించిన కబుర్లే. అల్లు అర్జున్‌​-సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్‌ వద్ద దమ్మురేపుతూ భాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్‌ కేక పెట్టించాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తొలిరోజే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు,మూడో రోజు కూడా అదే జోరు చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు,మూడో రోజు కూడా అదే స్దాయిల్ భాక్సాఫీస్ దగ్గర తన సత్తాచూపించినట్లు సమాచారం.   ఈ నేపధ్యంలో మైత్రీ మూవీస్ వారు చిత్రం ప్రమోషన్ నిమిత్తం ఓ వీడియో రిలీజ్ చేసారు. అది వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇందులో బన్నీ కామెంట్ కామెడీగా ఉంది.

ఈ వీడియో ఓ ఇంటర్వూలా సాగింది. ఇందులో హీరో అల్లు అర్జున్ సెట్ లో సుకుమార్ ఎలా ఉంటారోనని ఇమిటేట్ చేస్తూ చేసి చూపించారు. షాట్ పూర్తయిపోగానే ఎలా ఉందో అన్న టెన్షన్ తనకు ఉంటుందని, సుకుమార్ ఏమో తల గోక్కుంటూ అటు ఇటు తిరుగుతా ఉంటే తనకేమో షాట్ బాగా రాలేదేమో అని, సరే ఓ  రెండు మూడు నిముషాలు సెట్ లో అలా తిరిగేసి సుకుమార్ దగ్గరికి వెళ్లి, మళ్ళీ షాట్ తీద్దామా అని అడుగుతానని అల్లు అర్జున్ తెలిపారు. 

‘డార్లింగ్ మళ్ళీ టేక్ చేద్దామా’ అన్న దానికి సుకుమార్ స్పందిస్తూ… ‘హా డార్లింగ్ టేక్ బాగా వచ్చిందని’ ఒక్కసారిగా చెప్తారని అల్లు అర్జున్ చేసిన ఇమిటేట్ ఫన్నీగా ఉంది. ‘నిన్ను తగలెయ్యా’ ఎందుకింత టెన్షన్ పెట్టావు అని తాను లోలోన అనుకునేవాడినని, దీనికి సుకుమార్ నన్ను క్షమించాలని నవ్వుతూ చెప్పేసారు బన్నీ. ఈ ఇమిటేటింగ్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. 

Also read Pushpa:నార్త్ ఇండియాలో షాకిస్తున్న ‘పుష్ప’, బన్నీపై కామెంట్స్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?