Mahesh with Balakrishna: మహేష్ తో ముగించనున్న బాలకృష్ణ

Published : Dec 22, 2021, 03:45 PM IST
Mahesh with Balakrishna: మహేష్ తో ముగించనున్న బాలకృష్ణ

సారాంశం

నటసింహం బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో (Unstoppable)ఫస్ట్ సీజన్ ముంగిపు దశకు చేరుకుంది. దీనిపై మేకర్స్ అధికారిక సమాచారం అందించారు. దీంతో ఫైనల్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి పెరిగిపోయింది.

 
ఫీల్డ్ ఏదైనా బాలయ్య దిగనంతవరకే... ఆయన రంగంలోకి దిగాక అన్ని రికార్డులు మటాషే. సినిమాల్లో పేజీల కొద్దీ డైలాగులు గుక్క తిప్పుకోకుండా మాట్లాడే బాలయ్య వేదికలపై మాత్రం తడపడతాడు. అంటే ఆయన మాట్లాడేటప్పుడు పదాలు వెతుక్కుంటారు. ఈ లక్షణం దృష్టిలో పెట్టుకొని, ఆయనతో టాక్ షో అనగానే చాలామంది పెదవి విరిచారు. దానికి తోడు లౌక్యం తెలియని బాలయ్య.. హోస్ట్ గా ఎలా ఇముడుతారంటూ విమర్శలు చేశారు. 

సదరు విమర్శకుల నోళ్లు మొదటి ఎపిసోడ్ తోనే మూయించాడు బాలకృష్ణ(Balakrishna). దానికి తోడు టాక్ షో అంటే ఏదో నాలుగు గొప్పలు, ఆరు తిప్పలు గురించి మాట్లాడుకొని, డిప్లొమాటిక్ సమాధానాలతో ముగించడం కాదని కొత్త  భాష్యం చెప్పారు. జనాల్లో నలుగుతున్న కాంట్రవర్సీలకు క్లారిటీ ఇవ్వడం ద్వారా.. షోకి సరికొత్త ఇమేజ్ తెచ్చిపెట్టారు. ఈ విషయంలో ఎన్టీఆర్, చంద్రబాబు, టీడీపీ పార్టీ వంటి సున్నిత అంశాలు కూడా బాలయ్య టచ్ చేశారు. 

మొత్తంగా బాలయ్య టాక్ షో అంటే బోల్డ్ అండ్ ప్యూర్ అన్న పేరు తెచ్చుకున్నారు. కాగా ఇప్పటికే బాలకృష్ణ టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలను, దర్శక నిర్మాతలను ఇంటర్వ్యూ చేశారు. కాగా అన్ స్టాపబుల్ మొదటి సీజన్ చివరి దశకు చేరినట్లు ఆహా యజమాన్యం తెలియజేసింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో చివరి ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) గెస్ట్ గా రానున్నారు. 

Also read Balayya with Raviteja: రవితేజనేకాదు.. తాను కూడా అమ్మాయిలకు లైన్‌ వేసేవాడినంటూ బాలయ్య షాకింగ్‌ కామెంట్‌

ఇప్పటికే మహేష్ బాలయ్య షోలో పాల్గొన్నట్లు సమాచారం ఉంది. అయితే ఇది ఫైనల్ ఎపిసోడ్ గా ప్రసారం కానుందని స్పష్టత వచ్చింది. మరి ఈ షోలో మహేష్, బాలయ్య మధ్య ఎలాంటి ఆసక్తికర విషయాలు చర్చకు వస్తాయనే ఆసక్తి నెలకొని ఉంది. 

Also read ఎర్ర చీరలో యాటిట్యూడ్ చూపిస్తున్న బోల్డ్ హీరోయిన్ పూర్ణ... బుస కొడుతున్న ఆమె అందాలకు కుర్రకారు దాసోహం

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్