RRR promotions: యథా రాజా తథా ప్రజా.. రాంచరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 22, 2021, 02:01 PM IST
RRR promotions: యథా రాజా తథా ప్రజా.. రాంచరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సారాంశం

దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే నార్త్ లో ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇదిలా ఉండగా రాజమౌళి ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా ఒకే ప్రశ్న ఎదురవుతోంది. రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలని ఒక్కటి చేయడం.. ఇద్దరి హీరోల అభిమానులని సంతృప్తి పరచడం ఎలా సాధ్యం అయింది అని అడుగుతున్నారు. దీనికి రాజమౌళి తెలివిగా సమాధానం ఇచ్చారు. 

ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యాక మీడియా స్వయంగా అభిమానుల వద్దకు వెళ్ళింది. ట్రైలర్ లో చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరు బాగా కనిపిస్తున్నారు అని ప్రశ్నించారు. రాంచరణ్ అభిమానులు తమ హీరో బాగా చేసాడు అలాగే ఎన్టీఆర్ కూడా బాగా చేశాడు అని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అలాంటి సమాధానమే ఇస్తున్నారు. 

యథా రాజా తథా ప్రజా అనే సామెత ఉంది. రాజు ఎలా ఉంటాడో రాజ్యంలో ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఇక్కడ రాజులు చరణ్, ఎన్టీఆర్. వారిద్దరూ ఈ చిత్రం కంటే ముందు నుంచే మంచి స్నేహితులు. కాబట్టే వారి ఫ్యాన్స్ నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తోంది అని జక్కన్న సమాధానం ఇచ్చారు.  

రాంచరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా సునామి సృష్టించేందుకు రెడీ అవుతోంది. కొమరం భీం, అల్లూరి స్నేహితులు అయితే ఎలా ఉంటుంది అనే ఫిక్షనల్ పాయింట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

Also Read: Pushpa story: పుష్ప కథ కాపీనా.. ఆ వెబ్ సిరీస్ గురించే డిస్కషన్ ?

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌