Prabhas: ప్రభాస్ సినిమాల్లో కృష్ణంరాజు.. వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్

By Sambi Reddy  |  First Published Dec 22, 2021, 3:13 PM IST

90ల చివర్లో కృష్ణంరాజు హీరోగా రిటైర్ అయ్యారు. కథలో కీలకమైన క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రభాస్ స్టార్డం సొంతం చేసుకున్నాక, ప్రభాస్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.


ఎన్టీఆర్ (NTR), ఏఎన్ఆర్ జెనరేషన్ తర్వాత స్టార్స్ గా కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఎదిగారు. కృష్ణంరాజు రెబల్ స్టార్ గా ప్రత్యేకమైన ఇమేజ్ తో ఫ్యాన్ బేస్ సంపాదించారు. 55ఏళ్ల కెరీర్ లో కృష్ణంరాజు చేయని పాత్రలు లేవు. పౌరాణికం, జానపదం, సోషల్, హిస్టారిక్ ఇలా అన్ని రకాల పాత్రలు చేశారు. ఇక కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ పరిశ్రమకు పరిచయమయ్యారు. 2002లో విడుదలైన ఈశ్వర్ ప్రభాస్ మొదటి చిత్రం. 

వర్షం, ఛత్రపతి చిత్రాలు ప్రభాస్ ని మాస్ హీరోగా నిలబెట్టాయి. బాహుబలి (Bahubali) సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ప్రభాస్... పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దేశంలోనే అత్యధిక బడ్జెట్ చిత్రాలు చేస్తున్న హీరోగా రికార్డులకు ఎక్కారు. కాగా 90ల చివర్లో కృష్ణంరాజు హీరోగా రిటైర్ అయ్యారు. కథలో కీలకమైన క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రభాస్ స్టార్డం సొంతం చేసుకున్నాక, ప్రభాస్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 

Latest Videos

2009లో దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన బిల్లా మూవీలో ప్రభాస్ మాఫియా డాన్ రోల్ చేశారు. ఈ మూవీలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. బిల్లా చిత్రంలో మొదటిసారి ప్రభాస్, కృష్ణంరాజు సిల్వర్ స్క్రీన్ పంచుకున్నారు. బిల్లాను వెంటాడే పోలీస్ అధికారి పాత్రలో కృష్ణంరాజు కనిపించారు. 

బిల్లా మూవీ అనంతరం రెబల్ చిత్రంలో కలిసి నటించారు. దర్శకుడు లారెన్స్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ రెబల్ మూవీలో ప్రభాస్ తండ్రి పాత్ర చేశారు ఆయన. ముచ్చటగా మూడోసారి రాధే శ్యామ్ మూవీలో వీరిద్దరూ కలిసి కనిపించనున్నారు. రాధే శ్యామ్ లో ఆయన పరమహంస అనే ఆధ్యాత్మిక గురువుగా కనిపించనున్నారు. ఆయన లుక్ ఇటీవల విడుదల చేశారు. 

అయితే ప్రభాస్ సినిమాల్లో కృష్ణంరాజు నటించడం ఒక బ్యాడ్ సెంటిమెంట్ గా ఉంది. గతంలో ప్రభాస్, కృష్ణంరాజు(Krishnam Raju) నటించిన బిల్లా, రెబల్ అనుకున్నంత విజయం సాధించలేదు. బిల్లా మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకోగా, రెబల్ ప్లాప్ ఖాతాలో చేరింది. బిల్లా మూవీ ప్రభాస్ కి ఇమేజ్ తెచ్చిపెట్టినప్పటికీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. రెబల్ మాత్రం ప్రభాస్ కెరీర్ లో చెత్త మూవీగా నిలిచిపోయింది. 

Also read స్టార్ హీరోలంతా షూటింగ్స్ లో బిజీ.. ఎవరెక్కడ ఉన్నారో తెలుసా...?
ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ (Radhe Shyam)మూవీ రిజల్ట్ పై కొందరు ఆందోళన చెందుతున్నారు. బిల్లా, రెబల్ సెంటిమెంట్ పునరావృతమైతే పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నారు. అయితే సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ చాలా ఎక్కవ. అలా అందరూ సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఆ లెక్కన ప్లాప్ మూవీ అనేది ఇండస్ట్రీలో తెరకెక్కకూడదు. కానీ టాలీవుడ్ హిట్ పెర్సెంటేజ్ కేవలం రెండు శాతం మాత్రమే.  కాబట్టి ఈ సెంటిమెంట్స్ ప్రతిసారి నిజమవుతాయనే గ్యారంటీ లేదు. సినిమాలో దమ్ముంటే అవన్నీ ఎగిరిపోతాయి.

Also read Radheshyam Trailer Upadate: `రాధేశ్యామ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్.. ట్రైలర్ కోసం ప్లాన్‌ అదిరిందిగా

click me!