ఉదిత్ నారాయణ్ కొడుకు అరెస్ట్..!

Published : Mar 13, 2018, 05:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఉదిత్ నారాయణ్ కొడుకు అరెస్ట్..!

సారాంశం

బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ అరెస్ట్ బాధ్యతాయుతంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలు కావడానికి కారణమయ్యాడు​

                                 

 

బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ బాధ్యతాయుతంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలు కావడానికి కారణమయ్యాడు. ముంబయిలో జరిగిన ఈ ఘటనతో ఆదిత్య అరెస్టయ్యాడు. ఈ కేసులో ఆదిత్యకు వెంటనే బెయిల్ కూడా లభించింది.

గతంలో ఒకసారి ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి బుక్కయ్యాడు. మీ అంతు చూస్తా అంటూ అతను బెదిరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా అతను తన బెంజ్ కారును ర్యాష్ గా నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడు. యు టర్న్ వద్ద కూడా విపరీతమైన వేగంతో కారు నడిపిన అతను ఆటో రిక్షా మీదికి కారును ఎక్కించేశాడు.

దీంతో ఆటో రిక్షా కార్మికుడితో పాటు అందులోని మహిళ కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారి వాంగ్మూలం మేరకు పోలీసులు ఆదిత్యపై కేసు నమోదు చేశారు. ఆదిత్య చిన్నపుడే బాలనటుడిగా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని అందుకుని సింగర్ గా మారాడు. ప్రస్తుతం నటుడిగా.. గాయకుడిగా కొనసాగుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

Arijit Singh Telugu Songs: స్టార్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ పాడిన తెలుగు హార్ట్ టచ్చింగ్‌ సాంగ్స్ ఇవే
BMW Movie Collections: రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` 14 రోజుల బాక్సాఫీసు వసూళ్లు.. మరో డిజాస్టర్‌