ఎన్టీఆర్ భార్య గా బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక ... ఆమె ఎవరో తెలుసా..?

Published : Mar 13, 2018, 03:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఎన్టీఆర్ భార్య గా బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక ... ఆమె ఎవరో తెలుసా..?

సారాంశం

ఎన్టీఆర్ బయోపిక్ భారీ స్థాయిలో రూపొందించడానికి బాలకృష్ణ సిద్ధం అవుతున్నారు వచ్చే ఏడాది ఎన్నికల ముందు ఎన్టీఆర్ బయోపిక్ ని విడుదల చేయాలనేది బాలయ్య ఆలోచన​ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి​

ఎన్టీఆర్ బయోపిక్ భారీ స్థాయిలో రూపొందించడానికి బాలకృష్ణ సిద్ధం అవుతున్నారు. స్వయంగా బాలయ్య నటించబోతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది ఎన్నికల ముందు ఎన్టీఆర్ బయోపిక్ ని విడుదల చేయాలనేది బాలయ్య ఆలోచన. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్ గా 62 గెటప్ లలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నా విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ యంగ్ గా ఉన్నప్పటి పాత్ర కోసం శర్వానంద్ ని ఎంపిక చేసారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వివరాలపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావలసి ఉంది.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి