ఇద్దరు హీరోయిన్లను పక్కా చేసుకున్న ఎన్టీఆర్

Published : Jan 30, 2017, 07:09 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఇద్దరు హీరోయిన్లను పక్కా చేసుకున్న ఎన్టీఆర్

సారాంశం

కళ్యాణ్ రామ్ నిర్మాతగా రానున్న ఎన్టీఆర్ చిత్రం కోసం హీరోయిన్ల వేట ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్న కొత్త చిత్రం రాశిఖన్నా, నివేదా థామస్ లను హీరోయిన్లుగా కన్ఫమ్ చేసిన టీమ్

జనతా గ్యారేజ్ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ బంపర్ సక్సెస్ కావటంతో... మళ్లీ తర్వాతి సినిమా కూడా ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని చిన్న గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ దర్శకుడు బాబీ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. ఈ మూవీ ఫిబ్రవరి మూడో వారంలో మొదలవుతుంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు కావాలట. ఇప్పటికే ఇద్దర్ని అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు.

 

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 10న లాంచ‌నంగా ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 15 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్ర‌లు చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. సినిమాకు జై ల‌వ‌కుశ అనే టైటిల్ కూడా రిజిష్ట‌ర్ చేయించారు. తాజా సమాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు. ఒక‌రు నివేదా థామ‌స్ కాగా, మ‌రొక హీరోయిన్ రాశిఖ‌న్నా. జెంటిల్‌మ‌న్ త‌ర్వాత నివేదాథామ‌స్ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. నివేదా జూన్ నుండి షూటింగ్‌లో పాల్గొంటుంద‌ట‌.

PREV
click me!

Recommended Stories

Jr Ntr కి రెండో సారి హ్యాండిచ్చిన త్రివిక్రమ్‌.. తారక్‌కే ఎందుకిలా జరుగుతుంది?
తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్