
అక్కినేని వారింట కొన్ని నెలల గ్యాప్ లోనే రెండు సంబరాలు జరిగాయి. నాగార్జున ఇద్దరు కుమారుల ఎంగేజ్ మెంట్ వేడుకలు ముగిసాయి. గతేడాది డిసెంబర్ 9న అఖిల్, శ్రియా భూపాల్ ల ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక ఆలస్యం చేయకూడదని డిసైడ్ అయిన నాగ్ చైతూ, సమంతల నిశ్చితార్థం కూడా ఫినిష్ చేయించాడు. తన ఆనందాన్ని అందరితో షేర్ చేసుకుంటూ మురిసి పోతున్నాడు నాగార్జున.
అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన నాగార్జున తనయుడు టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా కూల్‌గా ఈ ఎంగేజ్ మెంట్ నిర్వహించారు. తన పెద్ద కుమారుడి ఎంగేజ్ మెంట్‌పై నాగార్జున చాలా హ్యాపీగా ఉన్నారు.
నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం పొటోలను, తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంటూ ట్వీట్లో రాసుకొచ్చారు కింగ్ నాగార్జున. మా అమ్మ నా కూతురు అయిందని పేర్కొన్న నాగ్.. సమంత, చైతూకు ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడుగుతున్న ఫొటోను షేర్ చేసుకున్నారు. #chaisam చైస్యామ్ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించేశారు నాగార్జున.