శృంగారభరిత గీతంలో నటించడం మధురమైన జ్ఞాపకం:   ప్రజ్ఞా జైశ్వాల్‌

Published : Jan 29, 2017, 08:12 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
శృంగారభరిత గీతంలో నటించడం మధురమైన జ్ఞాపకం:   ప్రజ్ఞా జైశ్వాల్‌

సారాంశం

నాగార్జున హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన సినిమా ఓం నమో వేంకటేశాయ హాథీరామ్‌ బాబా టీనేజ్‌లో ప్రేమించిన భవాని పాత్రలో న‌టించిన  ప్రజ్ఞా జైశ్వాల్‌

 

చిన్నప్పట్నుంచీ భవానీకున్న ఏకైక కల ఒక్కటే. రామ్‌బాబా ని పెళ్లి చేసుకోవడం . పెళ్లి కుదిరిన తర్వాత ‘ఎప్పుడూ దేవుణ్ణి చూడాల’నే కోరికతో రామ్‌బాబా తిరుగుతున్నాడని తెలుస్తుంది. భగవంతుడి కంటే ఏదీ పెద్దది కాదని భవాని అర్థం చేసుకుని, తన ప్రేమని త్యాగం చేస్తుంది. భగవంతుడి దగ్గరకి అతణ్ణి పంపిస్తుంది.

చిత్రంలో నాది చిన్న పాత్రే కానీ చాలా ముఖ్యమైన పాత్ర. నాగార్జున–కె. రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’ ‘శ్రీ రామదాసు’ చిత్రాలు చూశా. అలాంటి క్లాసిక్స్‌ తీసిన కాంబినేషన్‌లో మరో భక్తిరస చిత్రం కావడంతో నా పాత్ర నిడివి గురించి ఆలోచించకుండా అంగీకరించా. భక్తిరస చిత్రమైనా ఇందులో వాణిజ్య హంగులన్నీ ఉన్నాయి. భగవంతుడంటే నాకు నమ్మకముంది. కానీ, ప్రతిరోజూ గుడికి వెళ్లాలి, ఉపవాసం చేయాలనే నియమాలు పాటించను. ఈ కాలంలో అవన్నీ కష్టం కదా

 కృష్ణవంశీ ‘నక్షత్రం’లో నా పాత్ర ‘ఓం నమో వేంకటేశాయ’లో చేసిన పాత్రకి పూర్తి భిన్నంగా ఉంటుంది. పగలు ఓ సినిమా, రాత్రి మరో సినిమా.. ఈ రెండు సినిమాల షూటింగ్‌... ఒకేరోజు చేయడం ఓ సవాల్‌ అనిపించింది. ఈ రెండిటి తర్వాత మనోజ్‌కి జోడీగా నటించిన ‘గుంటూరోడు’ పక్కా కమర్షియల్‌ సినిమా.

PREV
click me!

Recommended Stories

సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?
Giri Babu: నమ్మించి మోసం చేశారు.! చిరంజీవి 'కొదమ సింహం' మూవీ వల్ల రూ. 20 లక్షలు నష్టపోయా