ప్రముఖ టీవీ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య, కారణం ఏంటి?.. అతడి వల్లే కెరీర్‌ నాశనం

Published : Jun 28, 2025, 12:16 AM IST
anchor swetcha

సారాంశం

ప్రముఖ టీవీ యాంకర్‌ స్వేచ్ఛ కన్నుమూశారు. ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె మరణానికి కారణాలేంటనేది తెలియాల్సి ఉంది. 

ప్రముఖ టీవీ యాంకర్‌ స్వేచ్ఛ కన్నుమూశారు. ఆమె శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో జవహర్‌ నగర్‌లోని తన ఇంట్లో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తలరించారు. 

స్వేచ్ఛ గత 18 ఏళ్లు గా తెలుగు టీవీ ఛానెల్స్ లో జర్నలిస్ట్ గా, యాంకర్‌గా పనిచేస్తున్నారు. టీవీ9తో ఆమె పాపులర్‌ అయ్యారు. అందులో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె టీ న్యూస్‌లోకి వెళ్లారు.

ప్రస్తుతం టీయుడబ్ల్యూజే స్టేట్‌ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. అలాగే ఇటీవల జర్నలిస్ట్ హౌసింగ్‌ సోసైటీలోనూ మెంబర్‌గా గెలుపొందారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్వేచ్ఛకి మ్యారేజ్‌ కూడా అయ్యింది. 

ఇంట్లో గొడవలా? , ఆఫీస్‌ కి సంబంధించిన సమస్యలా? భర్తతో గొడవలా అనేది సస్పెన్స్ గా మారింది. స్వేచ్ఛ మరణం పట్ల జర్నలిస్ట్ లు, యాంకర్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది స్వేచ్చ. తెలంగాణ వాదాన్ని న్యూస్‌ ద్వారా బలంగా వినిపించింది. పీడిత జనం స్వేచ్ఛ కోసం ఆమె పోరాడిందని ఆమె సన్నిహితులు, స్నేహితులు వెల్లడిస్తున్నారు. 

ప్రముఖ ఛానెల్‌ని తెలంగాణ నిలిపివేస్తే ఆమె ఢిల్లీ వెళ్లి అప్పటి సీఎం ఇంటి ముందు ధర్నా చేసిన ఘనత ఆమెదని, కానీ ఒక నీచుడి వేధింపుల కారణంగా ఆ ఛానెల్‌ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆమె సహచరులు తెలియజేస్తున్నారు. 

అతను తన కెరీర్‌ని నాశనం చేశాడని ఆమె వారి ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె టీ న్యూస్‌లో మంచి స్థానంలో ఉన్నారు. స్వేచ్ఛ మరణానికి కారణం ఏంటనేది సస్పెన్స్ గా మారింది.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..