నాగిని సీరియల్ ఫేమ్ Arjun Bijlaniకి ఒమిక్రాన్ పాజిటివ్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

Published : Dec 31, 2021, 01:57 PM IST
నాగిని సీరియల్ ఫేమ్ Arjun Bijlaniకి ఒమిక్రాన్ పాజిటివ్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

సారాంశం

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్(Omicron variant)  వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారత్‌లో కూడా ఈ వేరియంట్ కేసులు 1,200 దాటాయి. తాజాగా ప్రముఖ టీవీ నటుడు అర్జున్ బిజ్‌లానికి (Arjun Bijlani) ఒమిక్రాన్ పాజిటివ్ నిర్దారణ అయింది. 

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్(Omicron variant)  వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారత్‌లో కూడా ఈ వేరియంట్ కేసులు 1,200 దాటాయి. తాజాగా ప్రముఖ టీవీ నటుడు అర్జున్ బిజ్‌లానికి (Arjun Bijlani) ఒమిక్రాన్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఇటీవల తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసిన సంగతి తెలిసిందే. తనకు covid నిర్దారణ ఆయిన సమయంలో అర్జున్ తనకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. తాను గదిలో ఒంటరిగా ఉంటున్నానని.. తన కోసం ప్రార్థించాలని అభిమానులను కోరాడు. అందరూ సురక్షితంగా ఉండాలని.. తప్పకుండా మాస్క్ ధరలించాలని కోరాడు. దీంతో పలువురు టీవీ పరిశ్రమ సహచరులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేశారు.

అయితే అర్జున్‌కు తాజాగా ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టుగా ఈటీ టైమ్స్ పేర్కొంది. తాను ఇప్పుడు అనుభవిస్తున్న కొత్త వేరియంట్ అంత ప్రాణాంతకమైనది కాదని అర్జున్ తెలిపాడు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నాడు. అయితే ప్రస్తుతం ఇంట్లోనే వేరే గదిలో ఐసోలేషన్‌లో ఉన్నానని అర్జున్ చెప్పాడు. దీంతో తన కొడుకును ఎక్కువగా మిస్ అవతున్నానని తెలిపాడు. న్యూ ఇయర్, క్రిస్మస్ సందర్భంగా ఫ్యామిలీతో సెలవులు ప్లాన్ చేసుకన్నానని.. కానీ కరోనా కారణంగా అవి ఫలించలేదని అన్నాడు. 

అయితే తన తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని అర్జున్ వెల్లడించాడు. అయితే ఆమె వయసు 70 ఏళ్లు కావడం.. డయాబెటీస్‌తో బాధపడటం తమకను ఆందోళనకు గురిచేసిందని చెప్పారు. కానీ ఆమె ఇప్పుడు కోలుకుంటున్నారని.. ఆక్సిజన్ లెవల్స్‌ కూబా బాగానే ఉన్నాయని తెలిపారు. ఆమె షుగర్‌ లెవల్స్ రోజువారిగా పర్యవేక్షించబడుతున్నాయని అన్నారు. ఎవరూ కూడా భయపడవద్దని.. అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరాడు. 

Also read: ఒమిక్రాన్ ద‌డ : బెంగుళూర్‌లో ఆంక్ష‌ల స‌మ‌యం పొడ‌గింపు

అర్జున్ బిజ్‌లానీ టీవీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగిన్ సీరియల్‌లో లీడ్ రోల్‌లో కనిపించాడు. ఈ సీరియల్ నాగిని పేరుతో తెలుగులో కూడా ప్రసారమైంది. పలు సీరియల్స్‌లో నటించడమే కాకుండా రియాలిటీలో షోలలో పాల్గొనడం, కొన్ని షోలకు హోస్ట్‌గా కూడా వ్యహరించాడు. అంతేకాకుండా పలు షోలు, సీరియల్స్‌లో గెస్ట్ అప్పిరెయన్స్ కూడా ఇచ్చారు. Khatron Ke Khiladi 11 విన్నర్‌గా కూడా నిలిచాడు. 

PREV
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?