Allu Arjun Pushpa: వైరల్ అవుతున్న పుష్ప డిలీటెడ్ సీన్, ఉంచి ఉంటే.. థియేటర్లు దద్దరిల్లేవి అంటున్న నెటిజన్లు

Published : Dec 31, 2021, 01:55 PM IST
Allu Arjun Pushpa: వైరల్ అవుతున్న పుష్ప డిలీటెడ్ సీన్, ఉంచి ఉంటే.. థియేటర్లు దద్దరిల్లేవి అంటున్న నెటిజన్లు

సారాంశం

పుష్ప మూవీ నుంచి డిలీటెడ్ సీన్ రిలీజ్ చేశారు టీమ్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఉంచి ఉంటే బాగుండేది కదా.. థియేటర్లు దద్దరిల్లేవి అంటున్నారు నెటిజన్లు.

అల్లుఅర్జున్ – రష్మిక జంటగా.. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. డిసెంబర్17న రిలీజ్ అయిన ఈసినిమా తెలుగ,తమిళ,కన్నడ,మలయాళ,హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కలెక్షన్ల సునామీ సృస్టించిన ఈ మూవీ పాన్ ఇండియా తో పాటు ఓవర్ సిస్ లో కూడామంచి కలెక్షన్స్ సాధించింది. దాంతో ఫుల్ ఖుషీలో ఉన్న పుష్ట టీమ్ వరుసగా పుష్పకు సంబంధించిన మరికొన్ని అప్ డేట్స్ ను ఆడియన్స్ తో పంచుకుంటున్నారు.

 

రీసెంట్ గా  పుష్ప మూవీ నుంచి.. దాక్కో దాక్కో మేక ఫల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ సాంగ్ కు మస్త్ రెస్పాన్స్ వస్తోంది. ఇక దాని మ్యానియా నడుస్తుండగానే రీసెంట్ గా పుష్ప మూవీ నుంచి డిలీట్ చేసిన ఓ సీన్ ను రిలీజ్ చేశారు. అప్పు ఇచ్చిన వ్యక్తికి బర్రెలు అమ్మిమరీ ఆ అప్పు తీర్చేస్తాడు పుష్పరాజ్‌.అయితే.. అప్పు చెల్లించినట్లు ఊరందరికి చెప్పాలంటూ అతడిని కొట్టుకుంటూ ఊరంతా తిప్పుతాడు.

 

అద్భుతమైన డైలాగ్ తో అదరిపోయిన ఈసీన్ సినిమా డ్యూరేషన్ పెరిగిపోవడం వల్ల డిలీట్ చేశారు టీమ్. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సీన్  వైరల్ అవుతుంది. అయితే ఈ సీన్ మీద నెటిజన్లు వారి అభిప్రయాలు చెపుతున్నారు. ఈ సీన్ అద్భుతంగా ఉంది. సినిమా నుంచి ఎందుకు తీసేశారు. ఈ సీన్ కనుక ఉండి ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి కదా.. అంటూ.. కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. రాయలసీయ యాసలో బన్నీ డైలాగ్ కు ఫిదా అయిపోతున్నరు ఫ్యాన్స్.

గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లు అర్జున్.. రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించాడు. పక్కా మాస్ డైలాగ్స్ తో.. ఊరమాస్ పెర్ఫామెన్స్ తో అదరగోట్టాడు బన్నీ. తను పడ్డ కష్టానికి మంచి ప్రతిఫలం రావడంతో దిల్ ఖుష్ అవుతున్నారు టీమ్. ఈ ఆనందంలో లైట్స్ మెన్స్.. కు మిగతా చిన్న ఆర్టిస్ట్ లకు అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష ప్రకటించాడు సుకుమార్.

Als Read :Bhola Shankar update: ఫ్యాన్స్ కోసం చిరంజీవి న్యూ ఇయర్ గిఫ్ట్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే