Sudigali Sudheer Galodu: సుధీర్ గాలోడు సినిమా నుంచి టీజర్ రిలీజ్.. మామూలు గాలిపనులు కాదు

Published : Dec 31, 2021, 01:35 PM IST
Sudigali Sudheer Galodu:  సుధీర్ గాలోడు సినిమా నుంచి టీజర్ రిలీజ్.. మామూలు గాలిపనులు కాదు

సారాంశం

కమెడియన్ కమ్ హీరో సుడిగాలి సుధీర్ కొత్త సినిమాతో వస్తున్నాడు. గాలోడు టైటిల్ తో మాస్ కథను ట్రై చేశాడు సుధీర్. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

జబర్ధస్త్  కామెడీ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుని స్టార్ గా మారాడు సుడిగాలి సుధీర్. అటు షో చేసుకుంటూనే.. ఇటు హీరోగా.. కమెడియన్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మొదట చిన్న చిన్న పాత్రుల చేసిన సుధీర్ ఇప్పుడు హీరోగా వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. అయితే హీరోగా రెండు మూడు సినిమాలు చేసిన సుధీర్ కు.. వాటితో లైఫ్ టర్న్ అవ్వలేదు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

 

రీసెంట్ గా సుధీర్ నటించిన సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతుంది. గాలోడు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈమూవీ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు సుడిగాలి సుధీర్. రీసెంట్ గా ఈమూవీ నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. ఆడియనస్ ను అలరిస్తోంది. ముఖ్యంగా  అదృష్టాన్ని నమ్ముకున్న వాడు కష్టాల పాలు అవుతాడు.. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడు అవుతాడు.. కాని నేను రెండింటిని నమ్ముకోను.. నన్ను నేను నమ్ముతాను అంటూ సుధీర్ డైలాగ్ తో టీజర పై ఇప్రెషన్ వచ్చేసింది.

 

సుధీర్ కు మాస్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది. చాలామంది యూత్ సుధీర్ ను ఫాలో అవుతుంటారు. జబర్ధస్త్ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంటున్నాడు సుధీర్. దాంతో సుధీర్ సినిమాపై అంతో ఇంతో బజ్ క్రియేట్ అవుతుంది. దానికి తోడు సుధీర్ ఆటిట్యూడ్.. కామెడీ సెన్స్.. డాన్స్ ఇంకా ఇంప్రెషన్ పెంచుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈమూవీలో కమెడియన్లు 30 ఇయర్స్ పృథ్వీతో పాటు సప్తగిరి సందడి చేయబోతున్నారు.

Also Read : Ravi Teja Khiladi: మత్తెక్కుతాంది ఈడు అంటూ.. మాస్ మహారాజ్ ఊరమాస్ స్టెప్పులు..

 

PREV
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి