నాన్నకు చివరగా అదే ఇచ్చాను: తారక్

By Prashanth MFirst Published Oct 7, 2018, 4:29 PM IST
Highlights

ఎన్టీఆర్ అరవింద సమేత కోసం తీరిక లేకుండా గడుపుతున్నాడు. రిలీజ్ కు కొన్ని రోజులే ఉండడంతో చిత్ర యూనిట్ తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబందించిన విషయాల గురించే కాకుండా తన తండ్రిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. 

ఎక్కువగా హరికృష్ణ గారితో గడిపిన చివరిక్షణాల గురించి చెప్పాడు. అదే విధంగా తారక్ తన తండ్రికి చివరిసారిగా భోజనం పంపించిన విషయం గురించి వివరించాడు. తారక్ వంట బాగా చేస్తారని అందరికి తెలిసిందే.

ఇక ఆ విషయం గురించి మాట్లాడుతూ.. నాన్న మరణానికి కొద్దీ రోజుల ముందు నాకు ఫోన్ చేసి పలావ్ కావాలని చెప్పారు. దీంతో షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళగానే స్పెషల్ గా పలావ్ చేసి నాన్నకు పంపించానని ఎన్టీఆర్ తెలుపుతూ.. చివరిసారిగా నాన్నగారికి అదే ఇచ్చాను అని తెలిపాడు. ఇక తండ్రిని తలచుకొని తారక్ కొంత ఆవేదనకు లోనయ్యాడు.

అరవింద సమేత ఈ నెల 11న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను రాధ కృష్ణ నిర్మించారు. 

అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?

ఇది కరెక్ట్ టైటిల్.. డౌట్ అనవసరం: తారక్ కామెంట్

పగబట్టినా పర్ఫెక్ట్ గా పట్టాలి.. అదే త్రివిక్రమ్ స్టైల్!

'అరవింద సమేత'లో హైలైట్ అదే..!

'అజ్ఞాతవాసి' డిజాస్టర్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

click me!