అవును పవన్ పిచ్చోడే.. మరి మీరు.. తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

First Published Mar 16, 2018, 4:55 PM IST
Highlights
  • ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారడ్డి భరద్వాజ్ ఆయన మనసులో ఏముంటే అదే మాట్లాడుతారు
  • ఏదైన నికచ్చిగా ఉంటారు. రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూ లో ఆయన తాజా రాజకీయాలపై ప్రస్తుత పరిమాణాలపై స్పందించారు​

ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారడ్డి భరద్వాజ్. ఆయన మనసులో ఏముంటే అదే మాట్లాడుతారు. ఏదైన నికచ్చిగా ఉంటారు. రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూ లో ఆయన తాజా రాజకీయాలపై ప్రస్తుత పరిమాణాలపై చర్చించారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పై చాలా పాజిటివ్ గా స్పందించారు. ఆయన మాట్లాడుతు... పవన్ కల్యాణ్ టీడీపీ బీజేపీల డ్రామాపై మాట్లాడటం. ఈ రెండు పార్టీలు నాలుగేళ్లుగా తెలుగు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇంతలోనే టీడీపీ నుంచి ఎటాక్ మొదలైంది. పవన్ ను పిచ్చివాడని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పిచ్చివాడైతే.. 2014లో ఆయన ఇంటికెళ్లి మద్దతు ఎందుకు కోరారు?

ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు.. ఆ తర్వాత కాదన్నారు. ఆయన గురించి చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్లు, వామపక్షాలు మాట్లాడితే మీడియా కూడా పట్టించుకోలేదు. కానీ పవన్ కల్యాణ్ మాట్లాడాక ఒక చర్చ మొదలైంది. మీడియా కూడా దానిపై చర్చ చేస్తోంది. అందుకే ట్విట్టర్ మెసేజ్‌లతో ఒరిగేదేమి ఉండదు.. నువ్వు జనంలోకి రావాలని పవన్ కల్యాణ్‌కు గతంలోనే చెప్పా. ఇప్పటికైనా ఆ పని చేసినందుకు సంతోషం. ఆయన ఇదే స్టాండ్ మీద ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. కాబట్టి.. హ్యాట్సాఫ్ టు పవన్ కల్యాణ్.. అయితే అది నిన్నటివరకే. ఆ తర్వాత కూడా ఆయన ఇదే స్టాండ్‌పై ఉంటారా?.. లేక ఎప్పటిలాగే స్టాండ్ మారుస్తారా? అన్నది చూడాలి.

బీజేపీ వాళ్లు మాట్లాడితే కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. ఆ పార్టీ పనైపోయింది. రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పరిస్థితి అందరికీ తెలిసిందే. కాబట్టి.. వాళ్లు ఏం పీకలేకపోయారనే కదా ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చారు. మీరు దాని గురించి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీనే విమర్శిస్తూ కూర్చుంటే ఎలా?. మొత్తానికి మొన్న రాజస్తాన్ లో దెబ్బ, నిన్న యూపీలో దెబ్బ.. అలాగే నాసిక్ నుంచి ముంబైకి రైతుల పాదయాత్ర.. ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో భయంకరమైన అసంతృప్తి ఉందనేది స్పష్టమవుతోంది.

click me!