సింగర్ దలేర్ మహందికి జైలు శిక్ష

First Published Mar 16, 2018, 3:35 PM IST
Highlights
  • సింగర్ దలేర్ మహంతికి జైలు శిక్ష

ప్రముఖ బాంగ్రా పాప్‌ గాయకుడు దలేర్‌ మెహందీని మనుషుల అక్రమ రవాణా కేసులో పాటియాలా కోర్టు దోషిగా తేల్చింది. మానవ అక్రమ రవాణా కేసులో కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. 2003లో దలేర్‌ మెహందీ, అతని సోదరుడు షంషేర్‌ సింగ్‌లపై ఈ మేరకు కేసు నమోదుకాగా, ఈ కేసులో కోర్టు శుక్రవారం తుదితీర్పు ప్రకటించింది. తన మ్యూజికల్‌ ట్రూప్‌ విదేశాల్లో చేసే కార్యక్రమాల్లో భాగంగా అక్కడి వెళ్లే వారితో పాటు.. కొంత మందిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లినట్టుగా 2003లో దలేర్‌ మెహందీ, అతని సోదరుడు షంషేర్‌ సింగ్‌లపై కేసు నమోదైంది.

 

యూఎస్‌, యూకే, కెనడా లతో పాటు మరికొన్ని దేశాలకు దలేర్‌ మనుషులను తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి.దలేర్‌కు వ్యతిరేకంగా 31 కేసులు నమోదు కావటంతో గతంలో పాటియాలా పోలీసులు ఆయన్ను అరెస్ట్‌  చేశారు. తరువాత బెయిల్‌ పై విడుదలైన దలేర్‌ ఇన్నేళ్లుగా విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా దలేర్‌ మెహందీని దోషిగా తేల్చిన పాటియాలా కోర్ట్‌ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విదిస్తూ తీర్పు నిచ్చింది.

 

 

అయితే 2006లో పాటియాలా పోలీసులు దలేర్‌ మెహందీకి అనుకూలంగా.. రెండు డిశ్చార్జి పిటిషన్లు వేశారు. ఆయన అమాయకుడంటూ వారు పేర్కొన్నాకానీ కోర్టు ఒప్పుకోలేదు. ఆయనపై విచారణకు సరిపడా సాక్ష్యాలు ఉన్నాయంటూ పేర్కొంది. ప్రస్తుతం దలేర్‌తో పాటు ఆయన సోదరుడు షంషేర్‌ సింగ్ పాటియాలా కోర్ట్ కస్టడీలో ఉన్నారు.

click me!