పెళ్లికి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడు.. భర్తపై బుల్లితెర నటి ఫిర్యాదు!

Published : Nov 11, 2021, 11:44 AM IST
పెళ్లికి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడు.. భర్తపై బుల్లితెర నటి ఫిర్యాదు!

సారాంశం

గ్లామర్ ప్రపంచంలో తరచుగా మోసాలు, వేధింపులు వెలుగు చూస్తూ ఉంటాయి. ముఖ్యంగా నటిగా ఎదగాలని అనేక కలలతో పరిశ్రమలో అడుగుపెట్టే అనేక మంది అమ్మాయిలు మోసగాళ్లకు బలైపోతూ ఉంటారు.   

కర్ణాటకలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకోగా... నటి పోలీసులను ఆశ్రయించింది. వివరాలలోకి వెళితే... బసవగుడి అనే యువతి నటి కావాలనే కోరికతో పరిశ్రమకు రావడం జరిగింది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. టీవీ సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. తాను కూడా నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మాయమాటలు చెప్పాడు. 
  ఒకరోజు కలుద్దామని ఆమెను కోరడంతో, సరేనని బసవగుడి ఇంటికి ఆహ్వానించగా, లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

అనేకసార్లు వాంఛలు తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అడగడంతో అప్పటినుంచి దూరంగా ఉండసాగాడు. ఎంతో ఒత్తిడి చేసి స్నేహితులతో ఒప్పించడంతో గుడిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. అత్తవారింటికి తీసుకెళ్లిన తరువాత.. బలవంతంగా తాళి కట్టానని భర్త చెప్పుకున్నాడు. అయిష్టంగా పెళ్లి చేసుకున్న భర్తతో పాటు, అతని కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురి చేశారు.

Also read నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు... వెంకీ షాకింగ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్

పెళ్లి చేసుకున్నప్పటి నుండి గొడవలు జరుగుతున్నాయని, కట్నం తేవాలని ఒత్తిడి చేస్తూ కులం పేరుతో దూషిస్తున్నాడని వాపోయింది. తాను తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపింది. వివాహానికి ముందు తనపై భర్త అత్యాచారానికి పాల్పడ్డాడని బుల్లి తెరనటి బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కట్నం కావాలని కూడా వేధిస్తున్నారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని భర్త, అతని తల్లిదండ్రుల మీద ఆరోపణలు చేసింది. పోలీసులు ఇద్దరి నుంచీ సమాచారం సేకరించి దర్యాప్తు చేపట్టారు.  

Also read `హైపర్‌ ఆదిపై దాడి`.. స్పందించిన `జబర్దస్త్` కమెడీయన్‌.. తాను సంపాదించినదాంట్లో కొంత ఇస్తా అంటూ చురకలు

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్