నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు... వెంకీ షాకింగ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్

Published : Nov 11, 2021, 08:57 AM IST
నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు... వెంకీ షాకింగ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్

సారాంశం

నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు అంటూ విక్టరీ వెంకటేష్ పెట్టిన ఇంస్టాగ్రామ్ కామెంట్ సంచలనంగా మారింది. ఆయన ఈ పోస్ట్ సమంత-నాగ చైతన్య విడాకులు గురించే అంటూ... టాక్ నడుస్తుంది.

సమంత-నాగ చైతన్య (Naga chaitanya) విడాకుల ప్రకటన అందరినీ షాక్ గురి చేసింది. నాగార్జున ఈ పరిణామం బాధాకరం అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇంతకు మించి చైతు కుటుంబం నుండి ఎవరూ ఎటువంటి కామెంట్ చేయలేదు. నాగ చైతన్య అసలు నోరు విప్పలేదు. కనీసం సోషల్ మీడియాలో పరోక్షంగా కూడా ఎటువంటి పోస్ట్స్ పెట్టలేదు. నాగ చైతన్య సొంత మేనమామ వెంకటేష్ మాత్రం... పరోక్షంగా ఈ విషయంపై స్పందించడం విశేషం. గతంలో అనవసరమైన రూమర్స్, రాద్ధాంతం చేయకూడదు అంటూ.. ఆయన ఇన్ డైరెక్ట్ పోస్ట్ పెట్టారు. 


తాజాగా వెంకటేష్ (Venkatesh) మరోసారి ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందించారు. నిన్ను ఇష్టపడిన వాళ్ళను మిస్ యూజ్ చేయకు.  నిన్ను కావాలనుకున్న వాళ్లకు బిజీగా ఉన్నన్నాని చెప్పకు. నిన్ను పూర్తిగా నమ్మిన వాళ్ళను మోసం చేయకు. నిన్ను ఎప్పుడూ గుర్తు పెట్టుకునే వాళ్ళను మర్చిపోవద్దు... అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు. 


వెంకటేష్ చేసిన ఈ కామెంట్ సమంత (Samantha) -నాగ చైతన్య విడాకులు గురించే అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. మరి వెంకటేష్ ఉద్దేశంలో ఏవైరిని ఎవరు మోసం చేశారు అనేది ఇక్కడ ఆసక్తికరం. సమంత నాగ చైతన్య విడాకులపై అనేక రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా సమంతను పలు కోణాల్లో ఆమెను టార్గెట్ చేయడం జరిగింది. ఆమెకు అఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకున్నారని అంటూ అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ కథనాలపై ఫైర్ అయిన సమంత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై న్యాయ పోరాటానికి దిగారు. 

Also read యంగ్ హీరోయిన్ జీవితం నిలబెట్టిన సమంత.. ఆమె కన్నీటి కష్టాలు వింటే, షాకింగ్ డీటెయిల్స్
మరోవైపు వెంకటేష్ ఎఫ్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 ఫిబ్రవరి 22న విడుదల కానుంది. వెంకీ నటించిన మరో చిత్రం దృశ్యం 2 విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా దగ్గుబాటి రానా (Rana daggubati) తో కలిసి రానా నాయుడు పేరుతో ఓ సిరీస్ చేస్తున్నారు వెంకటేష్. హాలీవుడ్ సిరీస్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో బాబాయ్, అబ్బాయిలు కలిసి నటించడం విశేషం. ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్, తెరకెక్కిస్తోంది. 

Also read విడాకులపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్, అంతలోనే డిలీట్... సమంత గురించేనా!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే